ETV Bharat / business

'ఆహా ఓటీటీ'​ అదిరిపోయే ఆఫర్ - ఆ ప్లాన్​పై ఏకంగా రూ.3000 వర్త్​ డీల్​! - aha Plans and Pricings - AHA PLANS AND PRICINGS

Aha Subscription Plans : ఓటీటీ లవర్స్​కు నచ్చిన ప్లాట్​ఫామ్స్​లో ఆహా ఒకటి. ఇది 5 రకాల సబ్​స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. కొన్ని ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్, డీల్స్ కూడా అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

aha Plans and Pricings
Aha Subscription Plans 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 1:22 PM IST

Aha Subscription Plans : ఓటీటీ ప్లాట్​ఫామ్స్ అన‌గానే గుర్తొచ్చేవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్. ప్ర‌స్తుతం వీటి హ‌వా న‌డుస్తోంది. పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ వేరే దేశాలకు, ప్రాంతాలకు చెందిన‌వి. కానీ మ‌న తెలుగులో కూడా ఒక ఓటీటీ ప్లాట్​ఫామ్ ఉంది. అదే 'ఆహా'!

ఆహా - అనేది అర్హా మీడియా & బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ఓటీటీ ప్లాట్ ఫ్లామ్. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది మొద‌టి తెలుగు డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్. 2020 మార్చి 25న దీన్ని ప్రారంభించారు. దీనిలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎక్స్‌క్లూజివ్స్, ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్, ఆహా ఒరిజినల్స్ త‌దిత‌ర కంటెంట్ ఉంటుంది. ఈ యాప్ అన్ని మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ డివైజ్​ల్లో ప‌నిచేస్తుంది. అన్​స్టాప‌బుల్, సామ్ జామ్ లాంటి ప్రోగ్సామ్స్​తో బాగా ఫేమ‌స్ అయిందీ యాప్.

Aha Subscription Plans 2024 :
ఆహాలో 4 రకాల స‌బ్​స్క్రిప్ష‌న్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిల్లో 3 నెల‌ల వ్య‌వ‌ధి క‌లిగినవి రెండు, ఏడాది వ్య‌వ‌ధి క‌లిగిన ప్లాన్స్ మూడు ఉన్నాయి. వినియోగ‌దారులు త‌మ బ‌డ్జెట్​ను బ‌ట్టి తగిన ప్లాన్​ను ఎంచుకోవ‌చ్చు.

Aha 99 Plan : ఆహా ప్లాట్​ఫామ్​ రూ.99లకే బేసిక్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 3 నెల‌లు. ఇందులో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్​లు ఉంటాయి. 720p రిజ‌ల్యుష‌న్​తో హెచ్​డీ క్వాలిటీ వీడియోలు చూడొచ్చు. స్టీరియో ఆడియో ఉంటుంది. కానీ ఇది కేవలం మొబైల్లోనే వ‌స్తుంది. కంప్యూట‌ర్ లేదా టీవీల్లో దీనిని చూడలేము. స‌పోర్ట్ చేయ‌దు.

Aha 199 Plan : ఆహా రూ.199లకే మరో క్వార్ట‌ర్లీ ప్లాన్ అందిస్తోంది. దీనితో ఫుల్​ హెచ్​డీ (1080p) వీడియోలు చూడ‌వ‌చ్చు. స్టీరియో టైప్ ఆడియో ఉంటుంది. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్​లు వీక్షించ‌వ‌చ్చు. కానీ యాడ్స్ వ‌స్తాయి. చాలా మంది ప్రిఫ‌ర్ చేసే ప్లాన్ ఇది.

Aha 399 Plan : ఆహా 3 రకాల ఇయర్లీ ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటిలో మొద‌టి ప్లాన్ ధ‌ర రూ.399. ఈ ప్లాన్ తీసుకుంటే, 1080p రిజ‌ల్యుష‌న్​తో ఫుల్​ హెచ్​డీ క్లారిటీతో వీడియోలు చూడ‌వ‌చ్చు. స్టీరియో టైప్ ఆడియో ఉంటుంది. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్​లను చూడవచ్చు. దీనిలో లిమిటెడ్ యాడ్స్ వ‌స్తాయి.

Aha 699 Premium Plan : ఆహా రూ.699కు ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ప్లాన్ ఇస్తోంది. 1080p రిజ‌ల్యుష‌న్​తో ఫుల్​ హెచ్​డీ వీడియోలు, స్టీరియో టైప్ ఆడియో ఉంటాయి. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్​లు ఉంటాయి. ఎలాంటి యాడ్స్ రావు.

Aha Gold Plan : ఆహా గోల్డ్ ప్లాన్ ధర రూ.899. మిగ‌తా ప్లాన్స్ కంటే బెస్ట్ క్వాలిటీ ఆడియో, వీడియోలు ఉంటాయి. 4K క్వాలిటీతో వీడియోలు, Dolby 5.1 టెక్నాల‌జీతో ఆడియోలు ఆస్వాదించ‌వ‌చ్చు. ఇందులో తెలుగుతో పాటు, త‌మిళ సినిమాలు, వెబ్ సిరీస్​లు ఉంటాయి. వ్యాలిడిటీ ఒక సంవత్స‌రం. ఎలాంటి యాడ్స్ ఉండ‌వు. పైగా ఈ ప్లాన్ తీసుకుంటే రూ.3000 విలువైన డీల్స్​ను సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం, మీకు నచ్చిన ప్లాన్​ తీసుకుని, ఆహా కంటెంట్​ను ఆస్వాదించండి.

జీ5 ప్రీమియం స‌బ్​స్క్రిప్ష‌న్​పై అదిరిపోయే ఆఫర్స్​​- ఏడాది ప్లాన్​పై 40% డిస్కౌంట్! - ZEE5 SUBSCRIPTION offers

మీరు ఓటీటీ లవర్సా? ఈ నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి! - Netflix Plans In India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.