ETV Bharat / bharat

కశ్మీర్​లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కీలక మార్పు- కేంద్రం కసరత్తు! - JAMMU AND KASHMIR NEW GOVERNMENT

జమ్ముకశ్మీర్​లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం - దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన - ప్రమాణస్వీకారానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేత

Jammu And Kashmir President Rule
Jammu And Kashmir President Rule (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 4:56 PM IST

Jammu And Kashmir President Rule : జమ్ముకశ్మీర్​లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్​ (ఎన్​సీ), కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. ఈ మేరకు గరవర్నర్​కు ఓ లేఖను సమర్పించారు ఎన్​సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. అయితే ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందుగానే జమ్ముకశ్మీర్​లో విధించిన రాష్టపతి పాలనను ఎత్తివేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అసలు రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? ప్రస్తుతం ఎందుకు ఎత్తేయాలో తెలుసుకుందాం.

రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు?
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా రద్దు చేయక ముందు బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయ కారణాల వల్ల 2018లో కూటమి నుంచి బీజేపీ వైదొలగింది. దీంతో ప్రభుత్వం పతనం కావడం వల్ల శాసన సభను రద్దు చేస్తూ ఆరు నెలల పాటు గవర్నర్​ పాలను విధించారు. ఆ కాలం ముగియడం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ తర్వాత 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాల, భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. దీంతో పార్లమెంట్ అనుమతితో రాష్ట్రపతి 2019 అక్టోబర్​ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ ఓ నోటిఫికేషన్​ను జారీ చేశారు. అది ఇప్పటి వరకు కొనసాగుతోంది.

ఎందుకు ఎత్తివేయాలి?
కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు శాసనసభకు సంబంధించిన, జమ్ముకశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక నిబంధనలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి రావాలంటే ఆ నిబంధనలను పునరుద్ధించాల్సిన అవసరం ఉంది. పూర్తి బాధ్యతలు చేపట్టి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పని చేయలంటే రాష్ట్రపతి పాలన ఎత్తివేత అవసరమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అందుకు సంబంధించిన నోటిఫికేషన్​ను రాష్ట్రపతి త్వరలో జారీచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రక్రియ ఏంటి?
రాష్ట్రపతి పాలనను ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఒక నోటిఫికేషన్​ ద్వారా ఎత్తివేస్తారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తేయాలంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరం. క్యాబినెట్ అంగీకరించిన తర్వాతే రాష్ట్రతి పాలన ముగుస్తున్నట్లు ఓ నోటిఫికేషన్​ను జారీ చేస్తారు.

ఇప్పటికే జమ్ముకశ్మీర్​లో ప్రభుత్వ ఏర్పాటు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్​సీ అధినేత ఒమర్ అబ్దుల్లా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్​ మనోజ్ సెన్హాను కలిశారు. తమ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుపుతూ ఎల్​జీకి ఓ లేఖ సమర్పించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకారోత్సవం జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్​సీ- కాంగ్రెస్ కూటమి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు కలిగి ఉంది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.