ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల్లో జోరు- ఇప్పుడు బేజారు- మహా వికాస్ అఘాడీ పార్టీల ఫ్యూచర్​ ఏంటి? - FUTURE OF MVA PARTIES

మహారాష్ట్రలో రిపీట్​ కాని​ పార్లమెంట్​ ఎన్నికల ఫలితాలు - ఓటమి మూటగట్టుకున్న మహా వికాస్ అఘాడీ(ఎమ్​వీఏ) - కూటమిలోని పార్టీల భవిష్యత్​ ఏంటి?

What Will Be The Future Of MVA Parties
What Will Be The Future Of MVA Parties (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 5:20 PM IST

What Will Be The Future Of MVA Parties : మహారాష్ట్రలో మహాయుతి(ఎన్​డీఏ) సాధించిన విజయం, రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. కొన్ని పార్టీలకు మహారాష్ట్రలో రానున్న రోజులు మరింత కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్​సీపీ చీలిన ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఎన్​సీపీ(శరద్​ పవార్), శివసేన(ఉద్ధవ్) తమ అధికార గుర్తును కూడా కోల్పోయాయి. ఈ క్రమంలో జరిగిన అస్తిత్వ పోరాటంలో ఓటమి పాలయ్యాయి. ఇది ఒక రకంగా ఆ పార్టీలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మరోవైపు, హరియాణాలో అనూహ్యంగా పరాజయం పాలైన కాంగ్రెస్, మహారాష్ట్రలోనైనా విజయం సాధించి, ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలనుకుంది. కానీ హస్తం పార్టీ ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీల భవిష్యత్​ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఈ పార్టీల భవిష్యత్తు ఏమిటి?
శివసేన(ఉద్ధవ్) సొంత దారి చూసుకుంటుందా?
పార్లమెంట్​ విజయం ఓవైపు ఉత్సాహాన్ని ఇచ్చినా- ఉద్ధవ్​ ఠాక్రే, శరద్​ పవార్ పార్టీలు ఈ ఎన్నికల్లో​ అస్తిత్వ పోరాటం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్​తో కలిసి మహాయుతిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఈ పార్టీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పార్టీ అధికార గుర్తుతో పాటు, ఒరిజినల్ శివసేన తామే అని శిందే వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. బాలసాహెబ్ ఠాక్రే వారసులం తామే అని ప్రకటించుకుంటోంది. ఇక, ఇన్ని రోజులు హిందూ భావజాల పార్టీగా చలామణీ అయి, రాజకీయ భవిష్యత్తు కోసం భిన్న ధ్రువమైన కాంగ్రెస్​తో ఉద్ధవ్ పార్టీ కలిసింది. అందువల్లే ఈ శివసేనకు మద్దతు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు, అస్తిత్వం, ప్రజల మద్దతు కోల్పోయిన శివసేన(ఉద్ధవ్​) భవిష్యత్తు అగమ్య గోచరమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే- ఉద్ధవ్​ ఠాక్రే సిద్ధాంతపరంగా పార్టీని పునర్నర్మించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో మహా వికాస్​ అఘాడీలో ఉద్ధవ్​ వర్గం కొనసాగుతుందా, సొంత పంథా పడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

శరద్ పవార్​ వారసత్వాన్ని కొనసాగిస్తారా?
శరద్​ పవార్ నిర్మించిన సామ్రాజ్యం రెండు ముక్కలైంది. పార్టీ వ్యవస్థాపకుడికే అధికారిక చిహ్నం దక్కని నేపథ్యంలో ఎన్​సీపీ(శరద్​) ఎన్నికల బరిలో దిగింది. ఈ వర్గంలో ఎందరు కీలక నేతలు ఉన్నా- ఓట్లు పోలరైజ్​ చేయగలిగే సత్తా మాత్రం శరద్​ పవార్​కే ఉంది. అయితే, రాజకీయాలు చేయలేని వయసులో కూడా సాధ్యమైనంత మేర ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన వారసత్వాన్ని ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఒకవేళ తీసుకున్నా - దూకుడు మీద ఉన్న అజిత్​ పవార్​తో తలపడి, ఆ వర్గానికి ధాటిగా తమ పార్టీని నిలబెడతారా అనేది సందేహం. అసలే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. ప్రజలు మద్దతు కోల్పోయిన నేపథ్యంలో ఎన్​సీపీ(శరద్​) పార్టీని పునరిద్ధరించగలదా అనేది కూడా సందేహమే. ఈ అడ్డంకులన్నీ దాటి పార్టీకి పునర్వైభవం దిశగా పయనిస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుంది.

'ఇండియా'లో కాంగ్రెస్ ఇన్​ఫ్లుయెన్స్ ​తగ్గుతుందా?
లోక్​సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కొంత మేర రీచార్జ్ అయింది. ఆ ఉత్సాహంతో పార్టీ పనిచేసింది. హరియాణాలో గెలుస్తామనుకున్నా అనూహ్యంగా ఓడిపోయింది. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని- దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని మరింత ఇన్​ఫ్లుయెన్స్ చేయొచ్చు అని ఆశించిన కాంగ్రెస్​కు మొండి చేయి మిగిలింది. ఒకవేళ మహారాష్ట్రలో ఎమ్​వీఏ గెలిచి ఉంటే, ఇండియా కూటమిలో పునరుత్తేజం వచ్చేదని, బీజేపీ దారుణమైన రాజకీయాలను నెమ్మదించే అవకాశం ఉండేదని పార్టీ అంతర్గత వర్గాల మాట. ఈ ఓటమి ప్రభావం ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన స్థానానికి కీడు చేసే అవకాశమూ లేకపోలేదు. ఇండియా కూటమిలో ఐక్యతను ఇది ప్రభావితమం కూడా చేయగలదు. ఈ ఓటమి ప్రభావం- రానున్న ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకుల మాట.

శివసేన(శిందే), ఎన్​సీపీ(అజిత్) సత్తా
శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే, పార్టీని చీల్చి ఎన్​సీపీ అధికారిక గుర్తు పొందిన అజిత్‌ పవార్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​సీపీ(శరద్​ పవార్), శివసేన(యూబీటీ)- అధికారిక గుర్తులను పొందిన పార్టీల కంటే మెరుగ్గా రాణించాయి. బహుశా ఇది కూడా- ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ ఈ ఎన్నికలను సవాల్​గా తీసుకోవడానికి కారణం కావచ్చు. అధికారమే లక్ష్యంగా వ్యూహ చతురత, బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చాయి శిందే, అజిత్ పార్టీలు. ఇక, ఈ పార్టీలను విడగొట్టిన ఫలితం- బీజేపీని అధికారం చేజిక్కించుకునేలా చేసింది.

ఇటీవల హరియాణాలో గెలిచిన బీజేపీ అదే జోష్​తో వచ్చే ఏడాది జరిగే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకున్న శివసేన(శిందే) - ఎన్​సీపీ(అజిత్) పార్టీలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయగలవు. తమ పార్టీలకు ఉన్న పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.