Mamata Doctors Meeting : కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించారు. సోమవారం రాత్రి దాదాపు రెండు గంటలకు పైగా వైద్యులతో చర్చలు జరిపారు. వారు చేసిన ఆందోళనకారులు చేసిన అయిదు డిమాండ్లలో మూడింటికి మమతా సర్కార్ అంగీకరించింది. ఇందులో భాగంగానే మంగళవారం కోల్‌కతా పోలీసు కమిషనర్‌గా కొత్త అధికారిని నియమించనున్నారు. అరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌ను తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో విధులకు హాజరుకావాలని వైద్యులకు మమతా విజ్ఞప్తి చేశారు.
RG Kar Medical College Rape-Murder case | West Bengal CM Mamata Banerjee says, " we tried listening to junior doctors...we have decided to change the dc (kolkata police commissioner)...he agreed to resign himself...in health department, they demanded the removal of 3 persons and… pic.twitter.com/f7xkS4lNYM
— ANI (@ANI) September 16, 2024
ఆర్జీ కర్ వైద్యరాలి హత్యాచారం ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తూ నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై వైద్యులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎట్టకేలకు చర్చలు జరిపేందుకు అంగీకరించిన వైద్యులు సోమవారం సాయంత్రం కాళీఘాట్‌లోని సీఎం మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. మొత్తం 42 మంది వైద్య విద్యార్థుల బృందం మమతా బెనర్జీతో దాదాపు రెండు పాటు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు చేసిన అయిదు డిమాండ్లలో మూడింటికి ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో భాగంగానే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తొలగించి, మంగళవారం కొత్త అధికారిని నియమిస్తామని తెలిపింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌తో పాటుగా హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లను సైతం ఆయా పోస్టుల నుంచి తొలగిస్తామని పేర్కొంది. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కార్యాచరణ చేపట్టనుందని చర్చల ముగిసిన అనంతరం స్వయంగా మమత ప్రకటించారు.
VIDEO | Kolkata rape-murder case: " they had four demands...first one was that they had mentioned three names including health secretary. we have decided to remove dme (director of medical education) and dhs (director of health services) as per their demands. they also demanded to… pic.twitter.com/9kRhjyDgFE
— Press Trust of India (@PTI_News) September 16, 2024
'వెంటనే విధులకు హాజరుకావాలి'
డిమాండ్లకు అంగీకరించినందున ఆందోళనలను విరమించాలని వైద్యులను మమతా బెనర్జీ కోరారు. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోమని, వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలు వైద్యం అందక అల్లాడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని సైతం నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు.
'అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తాం'
ఇక సీఎం మమతతో సమావేశం అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తొలగిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం తమ నైతిక విజయమన్నారు. అయితే, సీఎం మమతా బెనర్జీ అంగీకరించిన తమ డిమాండ్లు సాకారమయ్యేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.