ETV Bharat / bharat

ఇకపై రెండేళ్లలోనే డిగ్రీ పూర్తి చేయొచ్చు! అవసరమైతే నాలుగేళ్లు చదవొచ్చు! UGC కొత్త రూల్స్

అధ్యయన సామర్థ్యం ఆధారంగా వేగంగా డిగ్రీ కోర్సులు పూర్తి- కీలక ప్రతిపాదన చేసిన యూజీసీ

UGC
UGC (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 4:19 PM IST

UGC On Degree Courses Duration : అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ విద్యార్థులు త్వరలో డిగ్రీ కోర్సుల వ్యవధిని తగ్గించుకునే, పొడిగించుకునే ఆప్షన్​ను పొందుతారని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. యూజీ విద్యార్థులకు తమ డిగ్రీ ప్రోగ్రామ్​ల వ్యవధిని వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్​ను తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు.

అభ్యాస సామర్థ్యం ఆధారంగా!
"విద్యార్థులు వారి అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారి డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించడం, పొడిగించుకునే ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏడీపీ) ద్వారా ప్రతి సెమిస్టర్​లో అదనపు క్రెడిట్స్​ను సంపాదించడం ద్వారా తక్కువ సమయంలో మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)తో డిగ్రీ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. ప్రతి సెమిస్టర్​లో తక్కువ క్రెడిట్స్ వచ్చినవారికి ఈ ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీ ప్రోగ్రామ్​లకు విద్యార్థుల అర్హతను అంచనా వేయడానికి ఉన్నత విద్యాసంస్థలు కమిటీలను ఏర్పాటు చేస్తాయి. ఈ డిగ్రీలతో అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీల్లానే వీటికి విలువ ఉంటుంది." అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.

'అదనపు క్రెడిట్లు పొందాలి'
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మొదటి లేదా రెండో సెమిస్టర్ చివరలో ఏడీపీని ఎంచుకునే అవకాశం ఉంటుందని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత ఏడీపీ ప్రోగ్రామ్​ను ఎంచుకోలేరని పేర్కొన్నారు. "ఏడీపీని ఎంచుకునే విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌లో అదనపు క్రెడిట్‌లను పొందాలి. విద్యార్థులు మొదటి సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, రెండో సెమిస్టర్ నుంచి అదనపు క్రెడిట్స్​ను సాధించాలి. రెండో సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, మూడో సెమిస్టర్ నుంచి అదనపు క్రెడిట్​ను సాధించాల్సి ఉంటుంది. 3 లేదా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్​లో కోర్సును గరిష్ఠంగా రెండు సెమిస్టర్ల వరకు పొడిగించుకోవచ్చు." అని పేర్కొన్నారు.

ఉన్నత విద్యాసంస్థలు ఎంచుకున్న వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన స్టూడెంట్స్​కు డిగ్రీలు అందించవచ్చని యూజీసీ చీఫ్ తెలిపారు. డిగ్రీ సర్టిఫికెట్ కోసం కోర్సు పూర్తి కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే వేగవంతమైన, పొడిగించిన డిగ్రీల కోసం విద్యార్థి స్వీయ నియంత్రిత నోటు రాయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.