ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు అలర్ట్​ - ఆ ఒక్క రోజు పలు సేవలు రద్దు - టీటీడీ కీలక నిర్ణయం! - TTD Cancelled Some Services - TTD CANCELLED SOME SERVICES

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఒక్కరోజు పలు సేవలు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

TTD Cancelled Some Services on June 21
TTD Cancelled Some Services on June 21 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 3:24 PM IST

TTD Cancelled Some Services on June 21: నిత్య కల్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో.. జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. జూన్​ 19 నుంచి జూన్​ 21 వరకు మూడు రోజులపాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్​ 21న అంటే.. రేపు పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో అలరారే శ్రీవారి, దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. దీనిని 1990 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. శ్రీ‌వారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో మూడు రోజుల పాటు ఈ క్రతువు నిర్వహిస్తారు.

మూడు రోజులు జరిగే కార్యక్రమాలు ఇవే: మొదటిరోజు ఆలయంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మ‌వార్ల‌కు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా.. శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

టీటీడీ గుడ్ న్యూస్ - ఉచితంగా కారు సాకర్యంతో స్వామి దర్శనం- వారికి మాత్రమే! - Free Darshan for Senior Citizens

ఈ క్రమంలోనే జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పౌర్ణమి గరుడసేవ: జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో.. శ్రీవారికి నిర్వహించే పున్నమి గరుడ సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.

తిరుమల బాలాజీకి తలనీలాలే ఎందుకు ఇస్తారు? దీని వెనుక కథేంటో తెలుసా? - why do we offer hair at tirupati

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.