ETV Bharat / bharat

టెలికాం సంస్థలకు ట్రాయ్ కొత్త రూల్స్ - సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం! - TRAI New Norms Mandate Telcos

TRAI's New Norms Mandate Telcos : టెలికాం సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది.

TRAI
TRAI (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 11:00 AM IST

TRAI's New Norms Mandate Telcos : టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన నూతన నిబంధనలను టెలికాం నియంత్రణాధికా సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది.

ట్రాయ్ కొత్త నిబంధనలు ఇవే!
ట్రాయ్​ జారీ చేసిన కొత్త సేవా నిబంధనలు ప్రకారం, జిల్లా స్థాయిలో నెట్​వర్క్‌ అంతరాయం కలిగితే పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీ పెయిడ్‌ వినియోగదారులకు అయితే కనెక్షన్‌ చెల్లుబాటు గడువు పెంచాలి. మరో ఆరు నెలల తర్వాత ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

నెట్​వర్క్ అంతరాయం 24 గంటలకు మించితే సర్వీసు ప్రొవైడర్లు అద్దెలో కొంత భాగాన్ని రిబేటుగా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదార్లకు వచ్చే బిల్‌ సైకిల్​లో వాటిని చూపించాలి. 12 గంటలకు పైగా అంతరాయం ఉన్నా అద్దెలో రిబేటు లేదా వ్యాలిడిటీ కొనసాగింపునకు దానికి ఒక రోజుగానే పరిగణించాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా నెట్​వర్క్ ఇష్యూ లేకుండా చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మాత్రమే, ఈ ప్రయోజనాలను అందించాల్సిన అవసరం ఉండదు.

అలా చేస్తే జరిమానా తప్పదు
నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే కంపెనీలకు కనీస అపరాధ రుసుమును రూ.50,000 నుంచి రూ.1లక్షకు పెంచింది ట్రాయ్. నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్​లను బట్టి రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల మేర జరిమానాను విధిస్తుంది. ప్రైమరీ, సెల్యులార్‌ మొబైల్‌ సర్వీసెస్, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్‌ వైర్​లెస్‌ సేవలకు ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఫిక్స్​డ్‌ లైన్‌ సర్వీసు ప్రొవైడర్లు అయినా పోస్ట్‌ పెయిడ్, ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. తమ నెట్​వర్క్​లోని వైఫల్యానికి మూడు రోజుల్లోగా పరిష్కారం చూపాల్సిందే. చెల్లింపు చేసిన 7 రోజుల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసు ప్రొవైడర్లు 98 శాతం కనెక్షన్లను యాక్టివేట్‌ చేయాలి. టెల్కోలు తమ వెబ్​సైట్లలో సర్వీసు ప్రకారం (2జీ, 3జీ, 4జీ, 5జీ) జియో స్పేషియల్‌ కవరేజీ మ్యాప్​లను వినియోగదారుల సౌకర్యం కోసం ఇవ్వాల్సి ఉంటుంది.

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

మీ క్రెడిట్ రిపోర్ట్ నుంచి 'లేట్ పేమెంట్స్'‌ను తొలగించాలా ? ఇలా చేయండి! - Late Payments In Credit Report

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.