ETV Bharat / bharat

స్వాతిపై దాడి కేసులో బిభవ్ కుమార్​కు 5రోజుల పోలీస్ కస్టడీ- ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు! - Swati Maliwal assault case - SWATI MALIWAL ASSAULT CASE

Swati Maliwal Assault Case : ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్​పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్‌కు హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

Swati Maliwal Assault Case
Swati Maliwal Assault Case (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 9:14 AM IST

Updated : May 19, 2024, 9:59 AM IST

Swati Maliwal Assault Case : ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్‌ కుమార్‌కు హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశాడని స్వాతీ మాలీవాల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయనను శనివారమే అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. బిభవ్​ కుమార్​ను ఏడు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మే 23 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ముందస్తు బెయిల్ కోసం బిభవ్​ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది.

అయితే కోర్టుకు ఇది చాలా తీవ్రమైన కేసు అని, ఒక పార్లమెంట్ సభ్యురాలు, ప్రజాప్రతినిధిపై దాడి జరిగిందని దిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే సీఎం నివాసం నుంచి సీసీటీవీ పుటేజీని కూడా లభించిందని చెప్పారు. బిభవ్ కుమార్ అధికార హోదాలో పనిచేశారని, ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయస్థానానికి తెలిపారు. బిభవ్ తన మొబైల్ పాస్​వర్డ్ అడిగినా చెప్పడం లేదని, ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఫోన్​ను ఫార్మాట్​ చేశారని ఆరోపించారు. అయితే తన ఫోన్​ హంగ్​ కావడం వల్లే ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్టు బిభవ్ కుమార్ తెలిపారని పేర్కొన్నారు. ఈ కేసులో బిభవ్ మొబైల్ కీలక సాక్ష్యమని, దానిని అన్​ లాక్ చేయాల్సి ఉంటుందని, అందుకే కస్టడీకి అప్పగించాలని కోర్టుకు దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మాలీవాల్ వైద్య నివేదిక
ఈ కేసులో స్వాతీ మాలీవాల్ వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్​లో స్వాతి మాలీవాల్​కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మే 16న వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్‌కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఎడమకాలుపై 3x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని, కుడి కన్ను కింద 2x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దాదాపు 3 గంటల వైద్యపరీక్షల నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. దీంతో స్వాతీ మాలీవాల్ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది.

'బీజేపీ ఆఫీస్​కు ఆతిశీ, రాఘవ్​, సౌరభ్ భరద్వాజ్‌!'- అరెస్ట్ చేసుకోండని మోదీకి కేజ్రీ సవాల్​ - Kejriwal Challenge To Modi

పోలింగ్​కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు- మాజీ సర్పంచ్ మృతి, టూరిస్ట్​లకు గాయాలు - Terrorist Attacks In Kashmir

Last Updated : May 19, 2024, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.