ETV Bharat / bharat

'ప్రశ్నకు నోటు' కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉండదు'- సుప్రీం కీలక తీర్పు

Supreme Court Law Makers Immunity : ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని పేర్కొంది.

Supreme Court Law Makers Immunity
Supreme Court Law Makers Immunity
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 11:17 AM IST

Updated : Mar 4, 2024, 12:47 PM IST

Supreme Court Law Makers Immunity : ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ సభ్యులకు లంచం కేసుల్లో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది.

పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్టసభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. చట్ట సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకున్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని CJI జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని దీనిని ఉపేక్షించలేమని అన్నారు.

ప్రధాని మోదీ స్పందన
ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధరిస్తుందని, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని ట్వీట్ చేశారు.

ఇదీ కేసు
కొన్నేళ్ల క్రితం జరిగిన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని, మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడం వల్ల సీతా సోరెన్‌ సుప్రీంకు వెళ్లారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా వారికి రక్షణ ఉంటుందా? అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది. అనంతరం ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి సోమవారం కీలక తీర్పు వెలువరించింది.

'వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణకు సిద్ధం'- ఈడీ సమన్లపై కేజ్రీవాల్ రిప్లై

'రాజీనామా చేస్తున్నా- ఆ విషయంపై అప్పుడే మాట్లాడతా'- కలకత్తా హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం

Last Updated : Mar 4, 2024, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.