ETV Bharat / bharat

'58ఏళ్ల వయసులో ఆమె తల్లి ఎలా అయ్యారు?!'- రాష్ట్ర సర్కార్​ నుంచి నివేదిక కోరిన కేంద్రం - Sidhu Moose Wala IVF

Sidhu Moose Wala Mother IVF Treatment : సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ట్రీట్​మెంట్​కు సంబంధించి నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్​మెంట్ పొందాలంటే మహిళ వయస్సు 21-50 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది.

Sidhu Moose Wala IVF
Sidhu Moose Wala IVF
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 3:26 PM IST

Sidhu Moose Wala Mother IVF Treatment : దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్​ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 58 ఏళ్ల వయసులో చరణ్ కౌర్​ IVF ద్వారా బిడ్డకు జన్మనివ్వడంపై ఆరా తీసింది. ఈ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి వయో పరిమితి గురించి ప్రస్తావించింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ట్రీట్​మెంట్​కు సంబంధించి నివేదిక సమర్పించాలని పంజాబ్ భగవంత్ మాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. నోటీసులో అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్​) యాక్ట్ 2021 సెక్షన్ 21(g) (i) ప్రకారం, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్​మెంట్ పొందాలంటే మహిళ వయస్సు 21-50 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది.

Sidhu Moose Wala IVF
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంజాబ్​ ప్రభుత్వానికి పంపిన నోటీసులు

'పంజాబ్ ప్రభుత్వం వేధిస్తోంది!'
మరోవైపు, పంజాబ్ ప్రభుత్వం తనకు పుట్టిన రెండో బిడ్డ విషయంలో వేధిస్తుందని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్​కౌర్ సింగ్​ ఆరోపించారు. ఐవీఎఫ్​ ద్వారా పుట్టిన చిన్నారికి సంబంధించిన పత్రాలను అందించమని పంజాబ్ ప్రభుత్వం కోరిందని తెలిపారు. అలాగే ఈ విషయంలో తనను అనేక ప్రశ్నలతో ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు..

నా బిడ్డ చికిత్సకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం వేధిస్తుందంటూ వీడియోను విడుదల చేశారు సిద్ధూ తండ్రి బాలాకౌర్ సింగ్. 'సీఎం సాబ్ చికిత్స పూర్తి అయ్యాక మీరు ఎక్కడికి రావాలంటే అక్కడి వస్తాను. నేను తప్పించుకునే ప్రయత్నాలు ఏం చేయడం లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే నాపై కేసు నమోదు చేసి జైలుకు పంపండి. నేను చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలను అందిస్తా' అని బాలాకౌర్ సింగ్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా మార్చి 17న పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చారు.

2022లో సిద్దూ హత్య
పాపులర్​ పంజాబీ ర్యాపర్ సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు ఆయనను అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్ధూ మూసేవాలా హత్య ఆయన అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ 2021 డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరారు. 2022లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', 'మోసా జఠ్‌' లాంటి చిత్రాల్లోనూ సిద్ధూ నటించారు.

మగ బిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి- 58ఏళ్ల వయసులో డెలివరీ

మరో బిడ్డకు జన్మనివ్వనున్న సిద్ధూ మూసేవాలా తల్లి- 58ఏళ్ల వయసులో గర్భం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.