ETV Bharat / bharat

సైఫ్​ అలీఖాన్​పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు- రిమాండ్​కు నిందితుడు - SAIF ALI KHAN ATTACK

సైఫ్​ అలీఖాన్​పై దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్​- ముంబయిలో పట్టుబడ్డ ​నిందితుడు - బంగ్లాదేశీయుడిగా గుర్తించిన పోలీసులు

Saif Ali Khan Attack
Saif Ali Khan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 6:31 AM IST

Saif Ali Khan Attack : సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంతకు ముందు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబయి వ్యాప్తంగా జల్లెడ పట్టారు. ఓ లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్ బందర్ రోడ్డులోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతోనూ సమాచారాన్ని రాబట్టారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తొలుత విజయ్ దాస్‌గా, తర్వాత బిజయ్ దాస్‌గా, ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్‌గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మమహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని పేర్కొన్నారు. నిందితుడి జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన వాడని పోలీసులు ధ్రువీకరించారు.

దుండగుడు బంగ్లాదేశ్ లోని ఝాలోకటికి చెందినవాడని చెప్పారు. ముంబయిలో ఐదు నెలలుగా ఉంటున్నాడని, కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ పనిచేశాడని చెప్పారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్‌ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని, కానీ ఓ బాలీవుడ్ నటుడి ఇంట్లోకి వెళ్లినట్టు తెలియదని ప్రాథమికంగా తెలిసినట్టు చెప్పారు. దొంగతనం, హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్ మెంటు 12వ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు నాలుగేళ్ల జేహ్, 8ఏళ్ల తైమూర్ , ఐదుగురు సహాయకులు ఉన్నారు. తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్ నానీ ఎలియామాను కోటి రూపాయలు డిమాండు చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్​తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి, హెక్సా బ్లేడ్​తో దాడి చేశాడు. ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు బాంద్రా కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 5 రోజుల రిమాండ్ విధించింది.

సైఫ్​ గురించి తెలియక అలా అనేశాను, ఆయన క్షమిస్తారని అనుకుంటున్నా : ఊర్వశీ రౌతేలా

సైఫ్‌ అలీ ఖాన్​పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం ఉందా? ఇకపై ఆయన సేఫేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.