Republic Day Special Sweets : దేశం మొత్తం గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అందరూ మిఠాయిలను పంచుకుని నోరు తీపి చేసుకుంటారు. అయితే.. ఈ సారి రెగ్యులర్ గా షాపు నుంచి తెచ్చే స్వీట్లు కాకుండా.. ఇంట్లోనే మూడు రంగుల మిఠాయిలు ట్రై చేయండి. గణంతంత్ర దినోత్సవాన ఈ స్వీట్లు మీ ఆత్మీయులను తప్పకుండా ఆకట్టుకుంటాయి.
త్రివర్ణ కేక్ : ఈ రిపబ్లిక్ డే రోజు సాధారణంగా కాకుండా త్రివర్ణ రంగులో కేక్‌ను ట్రై చేయండి. ఇందుకోసం కేక్‌ను తయారు చేసేటప్పుడు మూడు లేయర్‌లుగా డిజైన్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ కోసం కుంకుమ పువ్వును వినియోగించండి.
ట్రై కలర్ ఫిర్ని : పాలు, పంచదార, రవ్వతో తయారు చేసే ఫిర్ని స్వీట్‌ను ఈ సారి స్పెషల్‌గా రిపబ్లిక్ డే రోజు ట్రై కలర్‌లో చేయండి. ఇందులో ఆరెంజ్ కలర్ కోసం కుంకుమ పువ్వును, గ్రీన్ కలర్ కోసం ఆకుపచ్చ రంగు పిస్తాపప్పును వినియోగించండి. రెడీ అయిన ఫిర్నిని బాదం, పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
కివి మోతీచూర్ పర్ఫైట్ : రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైనా కొత్త డిజర్ట్‌ను తయారు చేయాలనుకునే వారికి కివి మోతీచూర్ పర్ఫైట్ ఒక మంచి ఛాయిస్. ఇందులో గ్రీన్ కలర్ కోసం కొన్ని కివి ముక్కలను వేసుకోండి. అలాగే కుంకుమపువ్వను చీజ్‌తో కలిపి ఆరెంజ్ కలర్‌ను రెడీ చేసుకోండి.
నోరూరించే 'బేసన్ లడ్డూ'.. సులువుగా చేసేయండిలా!
పిస్తా కొబ్బరి హల్వా : హల్వా అంటే ఇష్టపడని వారుండరు. ఈ సారి గణతంత్ర దినోత్సవం రోజు స్పెషల్‌గా తిరంగా హల్వాను రెడీ చేయండి. ఆరెంజ్ కలర్ కోసం కుంకుమపువ్వుతో హల్వా, గ్రీన్ కలర్ కోసం ఆకుపచ్చ పిస్తా హల్వా, కొబ్బరితో హల్వాను ప్రిపేర్ చేసి అన్నింటిని ఒక ప్లేట్‌లో సర్వ్ చేయండి.
తిరంగ సందేశ్ : సందేశ్ అనేది పనీర్ చీజ్‌తో తయారు చేసే బెంగాలీ స్పెషల్ స్వీట్. ఈ స్వీట్‌ను తయారు చేయడానికి పనీర్‌ను వేరు వేరు సాస్‌లతో మ్యారినెట్ చేయండి. తరవాత మూడు రంగులు వచ్చే విధంగా మిఠాయిని తయారు చేయండి. మధ్యాహ్న భోజనం తరవాత ఈ స్వీట్ వడ్డిస్తే చాలా బాగుంటుంది.
ఫ్లాగ్ ఫుడ్డింగ్ : ఫ్లాగ్ ఫుడ్డింగ్ అంటే జెండా రంగులతో తయారు చేసే లేయర్డ్ డెజర్ట్. దీనిని తయరు చేయడానికి ఆరెంజ్ కలర్ కోసం నారింజ పండ్లను తీసుకోండి. డెజర్ట్ ఫ్లాగ్ కలర్‌లో వచ్చేలా ఒక గాజు గ్లాస్‌లో పోసుకోండి. తరవాత గ్లాస్‌పై డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో గార్నిష్ చేస్తే సరిపోతుంది.
త్రివర్ణ బర్ఫీ : చాలా మందికి ఇష్టమైన స్వీట్‌లలో బర్ఫీ ఒకటి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సారి త్రివర్ణ బర్ఫీని ట్రై చేయండి. జెండా రంగులతో తయారు చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని నెయ్యి పూసిన ట్రేలో జాగ్రత్తగా పోసుకుండి. బర్ఫీ చల్లారిన తరవాత దాన్ని కట్ చేసి, డ్రై ఫ్రూట్స్‌తో సర్వ్ చేసుకోండి.
తిరంగ రాబ్డి : రాబ్డి అనేది పాలతో తయారు చేసే ఒక స్వీట్. ఇందులో యాలకులు, డ్రై ఫ్రూట్ ఉపయోగిస్తారు. ఈ సారి గణతంత్ర దినోత్సవం రోజు తిరంగా రాబ్డిని ప్రిపేర్ చేసి మీ కుటుంబ సభ్యులకు అందించండి.