Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం రెండు భారతదేశాలు ఉన్నాయని, అందులో ఒకటి ధనికులది, మరొకటి పేదలదని తెలిపారు. దేశంలోని రైతులు, కార్మికుల సమస్యలను మీడియా చూపించడం లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
"మీడియా మోదీజీని 24 గంటలు చూపిస్తుంది. ఐశ్వర్య రాయ్‌ను చూపిస్తుంది. కానీ రైతులు, కార్మికులు పడుతున్న సమస్యను చూపించదు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు సమస్యలు ఉన్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు వచ్చారు. వారిపై నేనెప్పుడు ద్వేషం చూపించలేదు."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో చేపడుతున్న భారత్ జోడో యాత్రలో యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, ఇతర ముఖ్యనేతలు, అప్నాదళ్ నాయకురాలు పల్లవి పటేల్, ఎస్పీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహల్‌గాంధీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శుక్రవారం బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలోకి రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించింది. రాయ్‌బరేలీలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాను పాల్గొంటానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
రాహుల్ యాత్రకు బ్రేక్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల హుటాహుటిన అక్కడకు బయల్దేరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ఈ సమయంలో ఆయన వయనాడ్‌లో ఉండటం అత్యవసరం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి యాత్రను రాహుల్ తిరిగి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.
కేరళలోని వయనాడ్‌లో ఇటీవల ఎనుగుల దాడిలో మరో వ్యక్తి మరణించడం వల్ల అన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. మనుషులకు, ఏనుగులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. నిరసనల కారణంగా వయనాడ్ వ్యాప్తంగా వాహనాలు నిలిచిపోయాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
'2029లో బీజేపీ ముక్త భారత్- ఆ పార్టీని ఓడించేది మేమే- అందుకే వారికి భయం'
సందేశ్‌ఖాలీ మంటలు- విపక్షాలను అడ్డుకున్న పోలీసులు- బంగాల్లో రాష్ట్రపతి పాలన!