Kargil Vijay Diwas 2024 : కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. లద్దాఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్ యుద్ధస్మారకం వద్ద ప్రధాని నివాళులు ఆర్పించారు. సైనికుల త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని మోదీ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi pays tribute to the heroes of the Kargil War at Kargil War Memorial on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/SEGqvW6ncc
— ANI (@ANI) July 26, 2024
Ladakh: Prime Minister Narendra Modi pays tribute to the heroes of the Kargil War at Kargil War Memorial on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/xLiTpjE8cB
— ANI (@ANI) July 26, 2024
అమరవీరులకు దేశవ్యాప్తంగా నివాళులు
కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురష్కరించుకొని నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. కార్గిల్ అమరవీరులకు పలువురు నేతలు నివాళులు ఆర్పించారు. కార్గిల్ యుద్ధ విజయం మన బలగాల ధైర్యానికి, అసాధారణ పరాక్రమానికి ప్రతీక అని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అన్నారు. కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులు ఆర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికుల త్యాగం, పరాక్రమాన్ని దేశప్రజలందరకీ స్ఫూర్తి అని రాష్ర్టపతి కొనియాడారు. దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని రాజ్‌నాథ్ అన్నారు.
త్రివిధ దళాల పుష్పాంజలి
భారత త్రివిధ దళాలలు నివాళులు ఆర్పించాయి. సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు ఆర్పించారు. భారత ఆర్మీ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యుద్ధస్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. నావికాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కుమార్ కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు ఆర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకున్న భారత వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి యుద్ధ స్మారకం వద్ద పుష్ప గుచ్చం ఉంచి, నివాళులు ఆర్పించారు.
కార్గిల్ యుద్ధం
భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని పాకిస్థాన్ కన్న కలలను కలలుగానే మిగిల్చింది కార్గిల్ యుద్ధం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రుసైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం, వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటమది. మన సైన్యం ధాటికి భారత భూభాగాలను ఆక్రమించాలని చూసిన పాకిస్థాన్ దళాలు తోకముడిచి, చివరికి సొంత దేశానికే పుట్టెడు అవమానాన్ని మిగిల్చాయి. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి శుక్రవారం నాటికి పాతికేళ్లు పూర్తయింది.