ETV Bharat / bharat

18వ లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా- ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలు - Parliament Session 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 10:06 AM IST

Updated : Jun 26, 2024, 12:06 PM IST

Parliament Session 2024
Parliament Session 2024 (Lok Sabha TV)

Parliament Session 2024 Live Updates : లోక్​సభ స్పీకర్‌ ఎన్నిక బుధవారం జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం అధికార ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మెహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్​డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఓంబిర్లా ఎన్నిక లాంఛన ప్రాయమే. అయితే, ఓటింగ్‌లో డివిజన్‌కు విపక్షం పట్టుబడితే సభ్యులకు స్లిప్‌లను పంపిణీ చేస్తారు. సభ్యులకు సీట్లు కేటాయించకపోవడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ పని చేయకపోవడం వల్ల మాన్యువల్ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఇరుకూటముల్లోని పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీచేశాయి.

LIVE FEED

11:52 AM, 26 Jun 2024 (IST)

టీడీపీ తరఫున ఓం బిర్లాకు శుభాకాంక్షలు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

రెండోసారి సభాపతిగా ఎన్నిక కావడం అరుదైన విషయం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

సభాపతిగా పదేళ్లు పూర్తిచేసుకుంటారని ఆశిస్తున్నా: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

గత ఐదేళ్లలో సభను విజయవంతంగా నడిపించారు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

లోక్‌సభ ప్రొసీజర్స్‌ను డిజిటలైజ్‌ చేసిన ఘనత మీది: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

సభను సజావుగా నడపడంలో టీడీపీ సహకరిస్తుంది: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

11:44 AM, 26 Jun 2024 (IST)

స్పీకర్‌ అన్ని పక్షాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి: అఖిలేశ్‌

జనవాణి వినిపించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కకుండా చూడాలి: అఖిలేశ్‌

లోక్‌సభా స్థానం చాలా ఎత్తులో ఉంది: అఖిలేశ్‌ యాదవ్‌

సభాధ్యక్ష స్థానం గౌరవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నా: అఖిలేశ్‌

విపక్షాలకు కూడా సమాన అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నా: అఖిలేశ్‌

11:35 AM, 26 Jun 2024 (IST)

ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు శుభాకాంక్షలు: రాహుల్‌గాంధీ

ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలి: రాహుల్‌గాంధీ

సభ సజావుగా నడపడంలో విపక్షం మీకు సహకరిస్తుంది: రాహుల్‌గాంధీ

ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నా: రాహుల్‌

విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడిపించడం అప్రజాస్వామికమవుతుంది: రాహుల్‌

రాజ్యాంగాన్ని బలపరిచేలా మీ పనితీరు ఉంటుందని ఆశిస్తున్నా: రాహుల్‌గాంధీ

11:22 AM, 26 Jun 2024 (IST)

మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు శుభాభినందనలు: ప్రధాని

లోక్‌సభ తరఫున కూడా మీకు శుభాభినందనలు తెలుపుతున్నా: ప్రధాని

వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉంది: ప్రధాని

సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలకపాత్ర: ప్రధాని మోదీ

గత ఐదేళ్లు విజయవంతంగా సభ నడిపిన అనుభవం మీకు ఉంది: ప్రధాని

అదే అనుభవంతో ఈ ఐదేళ్లు ముందుకు సాగుతారని విశ్వసిస్తున్నా: ప్రధాని

కొత్త ఎంపీలకు సభాపతి స్ఫూర్తిగా నిలుస్తారు: ప్రధాని మోదీ

గతంలో బలరాం ఝక్కడ్‌ ఐదేళ్ల తర్వాత మరోసారి స్పీకర్‌ పదవి చేపట్టారు: ప్రధాని

ఆ తర్వాత రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టే అవకాశం మీకు వచ్చింది: ప్రధాని

బలరాం జక్కడ్‌ తర్వాత స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగలేదు: ప్రధాని

పోటీ నెలకొన్న సందర్భంలో మీరు స్పీకర్‌ పదవి గెలిచి వచ్చారు: ప్రధాని

స్పీకర్‌ పదవి ఎంత కఠినమైనదో మీకు బాగా తెలుసు: ప్రధాని

చాలా మంది లోక్‌సభ సభ్యులకు మీతో పరిచయం ఉంది: ప్రధాని

గత ఐదేళ్ల మీ అనుభవంలో పార్లమెంటు ప్రతిష్ఠను పెంచారు: ప్రధాని

11:15 AM, 26 Jun 2024 (IST)

  • లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక
  • రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లా
  • ఓంబిర్లాను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లిన ప్రధాని మోదీ, కిరణ్‌ రిజిజు
  • ఓంబిర్లాను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లిన రాహుల్‌గాంధీ
  • రాజస్థాన్‌లోని కోట నుంచి ఎంపీగా ఎన్నికైన ఓంబిర్లా
  • రాజస్థాన్‌లోని కోట నుంచి మూడుసార్లు ఎన్నికైన ఓంబిర్లా

11:08 AM, 26 Jun 2024 (IST)

  • లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ
  • లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం
  • ప్రధాని మోదీ తీర్మానాన్ని బలపరిచిన కేంద్రమంత్రులు
  • ఎన్డీయే తరఫున లోక్‌సభ స్పీకర్‌ బరిలో ఓంబిర్లా
  • ఇండియా కూటమి తరఫున స్పీకర్‌ బరిలో కె.సురేష్‌

10:56 AM, 26 Jun 2024 (IST)

ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరగలేదనే స్పీకర్​ పదవి కోసం ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని బరిలోకి దించామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే అన్నారు. తాము సైతం స్పీకర్​ ఎన్నిక ఏకగ్రీవంగా కావాలని కోరుకున్నామన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూశామని, కానీ వారు స్పందించకోపవడం వల్లే అభ్యర్థిని నిలబెట్టామని చెప్పారు. సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఈ ఎన్నికలు అని తెలిపారు.

10:24 AM, 26 Jun 2024 (IST)

లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దానిని రాజ్​నాథ్ సింగ్ బలపరచనున్నారు. ఆ తర్వాత ఎంపీలు సంతకం చేయనున్నారు. అయితే స్పీకర్‌ ఎన్నికకు ప్రతిపక్షం షరతులు విధించడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. సభలోని సభ్యులందరూ కలిసి పని చేయాలని కానీ, ఇలా సాధారణంగా జరిగే స్పీకర్ ఎన్నికపై షరతులు పెట్టడం సరికాదని తెలిపారు.

Last Updated : Jun 26, 2024, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.