ETV Bharat / bharat

గెలుపు కోసం 16ఏళ్లుగా గిరిజన నాయకుడి పోరాటం- ఏడోసారి లోక్​సభ బరిలోకి- ఈ సారైనా విజయం వరించేనా? - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Palghar Tribal Leader Mohan Guhe : గెలిచే దాకా పోరాటం చేయడం మాత్రమే ఆయనకు తెలుసు. అందుకే వరుసగా ఏడోసారి ఎన్నికల బరిలోకి దూకారు మోహన్ గుహే. మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ గిరిజన నేత స్ఫూర్తిదాయక రాజకీయ ప్రస్థానంపై కథనమిది.

Palghar Tribal Leader  Mohan Guhe
Palghar Tribal Leader Mohan Guhe
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 7:22 PM IST

Palghar Tribal Leader Mohan Guhe : ఎన్నికలు అనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నాయకులు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు పూర్తి విభిన్నం. గెలిచే దాకా పోరాటం చేయడం గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తారు. భిన్నమైన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆ లీడర్ పేరు మోహన్ గుహే! గత పదహారేళ్లలో ఆయన నాలుగుసార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు పోటీ చేశారు. ఇప్పుడు ఏడోసారి మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగారు.

సాధారణ ప్రైవేటు టీచర్
మోహన్ గుహే గిరిజన వర్గానికి చెందిన నాయకుడు. గిరిజన వర్గం నేతలు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో చట్టసభల్లోకి అడుగుపెట్టాలనేది ఆయన జీవిత ఆశయం. అందులో భాగంగానే తాను కూడా చట్టసభల్లోకి ప్రవేశించాలనే పట్టుదలతో మోహన్ గుహే ఉన్నారు. ఈయన ఓ సాధారణ ప్రైవేటు టీచర్. మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ స్కూలులో ప్రైమరీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

తన జీతం నుంచి ఆయన ప్రతి సంవత్సరం దాదాపు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా పొదుపు చేస్తుంటారు. ఇలా ఐదేళ్లు కొంత మొత్తం పొదుపు చేశాక, కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విరాళాలను సేకరించి ఎన్నికల్లో పోటీకి దిగుతారు. గత 16 ఏళ్లుగా మోహన్ గుహే చేస్తున్నది ఇదే. ఏదైనా ఒకరోజు తాను తప్పకుండా చట్టసభలోకి అడుగుపెడతానని ఆయన ఆత్మవిశ్వాసంతో అంటున్నారు.

Devoted Person Workin
మోహన్ గుహే

నీటి సమస్యే ప్రధానం
పాల్ఘర్ జిల్లాలో ఐదు ఆనకట్టలు ఉన్నప్పటికీ నేటికీ నీటి సమస్యతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో మోహన్ గుహే ఎన్నికల వేళ ప్రజలను కలుస్తున్నారు. తనను గెలిపిస్తే నీటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఇతర పార్టీల నాయకుల్లా హామీలను మర్చిపోయే తత్వం తనది కాదని ఆయన వివరిస్తున్నారు. మోహన్ గుహే భార్య ఒక నర్సు. అందువల్ల ఆయనకు ఆరోగ్య రంగంపైనా మంచి అవగాహన ఉంది.

పాల్ఘర్ లోక్‌సభ పరిధిలోని గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మోహన్ చక్కగా ప్రసంగిస్తుంటారు. నాసిక్-దహను రూట్‌లో రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. తనను గెలిపిస్తే దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన అంటున్నారు. స్థానిక మత్స్యకారులకు కీలకమైన వద్వాన్ పోర్టుకు సంబంధించిన అంశాన్ని కూడా మోహన్ లేవనెత్తుతున్నారు. కాగా, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌కు 8000 ఓట్లు వచ్చాయి. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు 13,500 ఓట్లు వచ్చాయి. కాగా, ప్రస్తుతం పాల్ఘర్ లోక్‌సభ ఎంపీగా శివసేన నాయకుడు రాజేంద్ర ధేద్య గవిట్ ఉన్నారు.

మన ఎలక్షన్లు కాస్ట్లీ గురూ! ఎన్నికల వ్యయం తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే! - lok sabha election 2024

VVPATలు ఎలా పని చేస్తాయి? ధర ఎంత? తొలిసారి ఎప్పుడు వినియోగించారు? - VVPAT Working Model

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.