Nepal Bus Accident : నేపాల్‌లో ఓ బస్సు నదిలో పడి 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులతో నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్మండూకు బయలుదేరిన బస్సు, తనాహున్ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతంలో మార్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయినట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు. మృతులంతా మహారాష్ట్రవాసులని వెల్లడించారు. కాగా, మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్ విమానం నేపాల్ వెళ్లనునుంది.
#WATCH | Nepal | An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district, confirms Nepal Police.
— ANI (@ANI) August 23, 2024
“The bus bearing number plate UP FT 7623 plunged into the river and is lying on the bank of the river,” DSP Deepkumar Raya from the… pic.twitter.com/P8XwIA27qJ
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్(UP 53 FT 7623) ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూకు వెళ్తోంది. ఈ క్రమంలో తనాహున్ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. 45మందితో కూడిన రెస్క్యూ టీమ్ ప్రమాదస్థలికి చేరుకుని 29మంది ప్రయాణికులను రక్షించి ఆస్పత్రికి తరలించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు, నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్లో మెడికల్ టీమ్‌ను ఘటనాస్థలికి పంపించింది.
ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి స్పందించారు. అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.
నదిలో పడిపోయిన రెండు బస్సులు
గత నెలలో కూడా నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటం వల్ల 65మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో మృదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు నదిలో 100 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయాయి. భారత్ నుంచి 12మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. ఆ నదిలో కొట్టుకుపోయిన బస్సులను ఇంకా కనుగొనలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురు భారతీయులలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకలేదు.
నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్ - ఐదుగురు మృతి
టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం- 18మంది మృతి - Nepal Plane Crash