MSP Hike On Kharif Crops : ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరింది. వరితో పాటు పత్తి, రాగి, మొక్క జొన్న, జొన్నపంటలకు MSPని పెంచినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. పంట ఉత్పత్తి ధరకు పెంచిన ఎమ్మెస్పీ కనీసం 1.5శాతంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు గుజరాత్, తమిళనాడులో మొత్తం 7వేల 453 కోట్లతో ఒక గిగావాట్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్‌ను 76వేల కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
పంటల మద్దతు ధరలు ఇలా ఉన్నాయి :
- వరి (సాధారణ రకం)- రూ.2300
- వరి (గ్రేడ్-ఎ)- రూ.2320
- జొన్న (హైబ్రిడ్)- రూ.3371
- జొన్న (మాల్దండి)- 3421
- సజ్జలు- రూ.2625
- రాగులు- రూ.4290
- మొక్కజొన్న- రూ.2225
- వేరుశెనగ- రూ.6783
- పొద్దుతిరుగడు విత్తనాలు- రూ.7280
- నువ్వులు- రూ.9267
- సోయాబీన్ (పసుపు)- రూ. 4892
- పెసలు- రూ.8682
- పత్తి (మధ్యరకం)- రూ.7121
- పత్తి (లాంగ్ స్టెపెల్)- రూ.7521
- కందులు- రూ.7550
- మినుములు- రూ.7400
వీటితో పాటు పలు నూనె గింజలు, పప్పు ధాన్యాలకు సైతం మద్దతు ధర పెంచారు. మరోవైపు మహారాష్ట్రలోని విధావన్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది గనుక పూర్తి అయితే ప్రపంచంలోనే టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా చరిత్రకెక్కనుంది. అంతే కాకుండా దీని ద్వారా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగానూ దాదాపు పది లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. గుజరాత్, తమిళనాడులో మొత్తం రూ.7,453 కోట్లతో 1 GW ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వారణాసిలో లాల్ బహుదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు కూడా ఓకే చెప్పింది. అంతే కాకుండా కొత్త టెర్మినల్ భవనం నిర్మాణంతో పాటు రన్‌వేల విస్తరణ ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.2869.65 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.