ETV Bharat / bharat

ఐపీఎల్ కోసం మ్యారేజ్​ పోస్ట్ పోన్​- పెళ్లి బట్టలతో స్టేడియానికి- కానీ వర్షం కారణంగా! - Marriage Postponed For IPL Match

Marriage Postponed For IPL Match In Assam : ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు త్రిపురకు చెందిన ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. పెళ్లి దుస్తులతోనే వివాహ వేదిక వద్ద నుంచి అసోంలోని గువహటికి మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అప్పుడు ఏం జరిగిందంటే?

Marriage Postponed For IPL Match In Assam
Marriage Postponed For IPL Match In Assam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 10:41 AM IST

Marriage Postponed For IPL Match In Assam : భారత్​లో క్రికెట్​కు మంచి ఆదరణ ఉంది. అందులోనూ ఐపీఎల్ అంటే ఫ్యాన్స్ మరింత పిచ్చెక్కిపోతుంటారు. మ్యాచ్​ను చూడడానికి ఉద్యోగులు ఆఫీసుకు లీవ్​లు పెట్టడం, విద్యార్థులు కాలేజీ ఎగ్గొట్టడం చేస్తుంటారు. అయితే త్రిపురకు చెందిన ఓ క్రికెట్ అభిమాని కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్​ను చూసేందుకు పెళ్లి వేదిక నుంచి వచ్చేశాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది.

అసలేం జరిగిందంటే?
త్రిపురకు చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం కుదిరింది. అతడి పెళ్లి ఆదివారం(మే 19)న జరగాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్ జట్టుకు వీరాభిమాని. ఈ క్రమంలో మే 19న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువహటిలోని బార్సపరా స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వెంటనే అసోంలోని గువాహటిలోని బార్సపరా స్టేడియానికి పెళ్లి దుస్తులతో వెళ్లాడు. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అతడితో ఫొటోలు దిగారు.

అయితే పెళ్లిని వాయిదా వేసుకుని మరి కేకేఆర్, ఆర్ ఆర్ మధ్య జరిగే మ్యాచ్​ను చూసేందుకు వెళ్లిన వ్యక్తికి షాక్ తగిలింది. ఎందుకంటే ఆ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ఐపీఎల్-17 లీగ్ దశ చివరి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. కాగా, ఈ ఐపీఎల్ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్, కోల్​కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్​కు చేరుకున్నాయి.

ధోనీ కోసం రూ.64 వేలు పెట్టి బ్లాక్ లో టికెట్లు కొనుగోలు
ఈ ఐపీఎల్ సీజన్​లోనే మహేంద్ర సింగ్ ధోనీని చూసేందుకు ఓ ఫ్యాన్ రూ.64000 పెట్టి మరి బ్లాక్​లో టికెట్లు కొన్నాడు. తనతో పాటు ముగ్గురు కుమార్తెలను స్టేడియానికి తీసుకొచ్చాడు. అది కూడా తన కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బుతో ఈ టికెట్లు బ్లాక్​లో కొన్నట్లు సదరు అభిమాని తెలిపాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఆప్​ అంతం చేయడమే బీజేపీ లక్ష్యం- భయంతో 'ఆపరేషన్‌ ఝాడు': కేజ్రీవాల్ - AAP Leaders Protest

స్వాతిపై దాడి కేసులో బిభవ్ కుమార్​కు 5రోజుల పోలీస్ కస్టడీ- ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు! - Swati Maliwal assault case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.