ETV Bharat / bharat

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా- 13మంది మృతి, మరో 16మందికి గాయాలు - Madhya Pradesh Road Accident

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 6:33 AM IST

Updated : Jun 3, 2024, 7:04 AM IST

Road Accident in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో ట్రాక్టర్​ ట్రాలీ బోల్తా పడి నలుగురు చిన్నారులు సహా 13మంది మృతి చెందారు. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజ్​గఢ్​ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది.

Madhya Pradesh Road Accident
Madhya Pradesh Road Accident (ETV Bharat)

Road Accident in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడి 13మంది మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఆదివారం సాయంత్రం రాజస్థాన్​లోని మోతీపురా ప్రాంతానికి చెందిన 30మంది బృందం మధ్యప్రదేశ్​లోని కులామ్​పుర్​లో జరిగే పెళ్లికి ట్రాక్టర్​లో బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో రాజ్​గఢ్​ జిల్లాలోని పీప్​లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మరణించారు. గాయపడిన వారిలో 13మందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని చికిత్స కోసం భోపాల్​కు తరలించారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ తెలిపారు.

సీఎం, రాష్ట్రపతి దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, బాధితులకు ఎక్స్​ వేదికగా సంతాపం తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో 13మంది మరణించడం భాదకరమని మధ్యప్రదేశ్​ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. 'ఘటన స్థలానికి రాజ్​గఢ్​ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నారాయణ్​ సింగ్ పన్వార్​ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్​ ప్రభుత్వంతో సంప్రదించాం. ఆ రాష్ట్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు రాజ్​గఢ్​ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని భోపాల్‌కు తరలించాం. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని సీఎం మోహన్ యాదవ్ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

150అడుగుల లోయలో పడ్డ యాత్రికుల బస్సు- 22మంది మృతి
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఓ బస్సు అదుపు తప్పి 150 అడుగుల లోయలో పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఎన్నికల పక్రియ నిర్వీర్యానికి కుట్రలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు- అలానే లెక్కించాలని 'ఇండియా' విజ్ఞప్తి - lok sabha election 2024

'స్కామ్​ కోసం కాదు- నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకే జైలుకు'- తిహాడ్​కు​ తిరిగెళ్లిన కేజ్రీవాల్​ - kejriwal delhi liquor policy case

Last Updated : Jun 3, 2024, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.