Rajasthan Fire Accident : రాజస్థాన్‌లో కెమికల్స్‌తో నిండి ఉన్న ట్రక్కు మరికొన్ని వాహనాలను ఢీకొట్టడం వల్ల ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 37 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంటల్లో దాదాపు 30 ట్రక్కులు, మరికొన్ని ఇతర వాహనాలు దగ్ధమైనట్లు పేర్కొన్నారు. జయపుర- అజ్మేర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిందీ దుర్ఘటన.
25 అంబులెన్స్‌ల్లో బాధితులు తరలింపు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 25కు పైగా అంబులెన్స్‌లలో బాధితులను ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో జయపుర- అజ్మీర్ నేషనల్ హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై 300మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
#WATCH | Jaipur, Rajasthan | 4 dead and several injured in a major accident and fire incident in the Bhankrota area.
— ANI (@ANI) December 20, 2024
A fire broke out due to the collision of many vehicles one after the other. Efforts are being made to douse the fire. pic.twitter.com/3WHwok5u8W
క్షతగాత్రులకు పరామర్శించిన సీఎం
ప్రమాదంలో గాయపడి ఎస్ఎంఎస్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, అగ్నిప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
#WATCH | Rajasthan CM Bhajanlal Sharma reaches SMS Hospital to meet the injured in the Jaipur fire and take stock of the situation
— ANI (@ANI) December 20, 2024
(Source: CMO) pic.twitter.com/x4Sa63KPDz
#WATCH | Rajasthan CM Bhajanlal Sharma reaches SMS Hospital to meet the injured in the Jaipur fire and take stock of the situation
— ANI (@ANI) December 20, 2024
(Source: CMO) pic.twitter.com/x4Sa63KPDz
'ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డా'
అంతకుముందు ట్రక్కు ప్రమాద ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. "జయపుర-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన గ్యాస్ ట్యాంకర్ అగ్నిప్రమాదం వార్త విని చాలా బాధపడ్డాను. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఎస్ఎంఎస్ ఆసుపత్రికి వెళ్లాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలకు బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
Rajasthan CM Bhajanlal Sharma tweets, " i am deeply saddened to hear the sad news of casualties of citizens in the gas tanker fire incident on jaipur-ajmer national highway. as soon as the information about the incident was received, i went to sms hospital and directed the doctors… pic.twitter.com/sJzUIBaTQt
— ANI (@ANI) December 20, 2024
ప్రమాదంపై అమిత్ షా ఆరా
మరోవైపు, రాజస్థాన్ ట్రక్కు అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అగ్నిప్రమాద ఘటనపై సమాచారం తెలుసుకునేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, ఎస్ఎంఎస్ ఆస్పత్రి క్రిటికల్ బర్న్ వార్డులో సుమారు 5 పడకలు మిగిలి ఉన్నాయని రాజస్థాన్ ఆరోగ్యమంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు. 40 పడకల మరో వార్డును సిద్ధం చేశామని పేర్కొన్నారు.
జయపుర- అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు మరణించారని జయపుర కలెక్టర్ జితేంద్ర సోనీ తెలిపారు. మరో 40 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాపక దళం, అంబులెన్స్ లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని వెల్లడించారు. అలాగే 24-25 మంది ఎస్ఎంఎస్ ఆస్పత్రి ఐసీయూలో ఉన్నారని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దీపక్ మహేశ్వరి తెలిపారు.
#WATCH | Bhankrota fire accident | Jaipur | Rajasthan Health Minister Gajendra Singh Khimsar says, " around 5 beds are left in our critical burn ward. we have prepared another ward of 40 beds...the police team and administration team are active there. the traffic corridor has been… pic.twitter.com/IycW1xImb0
— ANI (@ANI) December 20, 2024
ఇంట్లో మంటలు చెలరేగి ఒకే ఫ్యామిలీలోని ఆరుగురు మృతి- నలుగురి పరిస్థితి విషమం
ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం- చిన్నారి సహా ఏడుగురు మృతి