IRCTC Facilities For Ayodhya Tourists : ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రాముడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి రామ భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు విచ్చేస్తున్న భక్తులతోపాటు పర్యటకులకు అత్యుత్తమ ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్- IRCTC కీలక నిర్ణయాలు తీసుకుంది.
అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్!
IRCTC Food Plaza Ayodhya Railway Station : అయోధ్య రైల్వేస్టేషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యటకులకు అందుబాటులో ఉంచనుంది ఐఆర్టీసీ. అందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రాల వారీగా ఫుడ్ ప్లాజాలను ఏర్పాటు చేస్తోంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికి చెందిన పర్యటకులైనా తమ వంటకాలను ఆస్వాదించగలిగేలా చర్యలు తీసుకుంటోంది.
దక్షిణ భారతదేశానికి చెందిన ఇడ్లీ, దోశ, సాంబార్, ఊతప్పంతోపాటు ఉత్తర భారతానికి చెందిన కాశ్మీరీ దమ్ ఆలూ, యఖ్నీ, రోగంజోష్, తుక్దియా భాత్, ధామ్‌లు అందుబాటులోకి తేనుంది ఐఆర్సీటీసీ. అదేవిధంగా ఈస్ట్ ఇండియాలో ఫేమస్ అయిన మామ్ చామ్, రస్గుల్లాతోపాటు పశ్చిమంలో ప్రసిద్ధి చెందిన పూరాన్ పోలీ, ధోక్లా, స్టఫ్డ్ బ్రింజాల్, జుంకా భక్రీ, ఖమాన్ కక్డీ, చౌలఫలి, మక్కీ పనీర్ పకోడా, పాపడ్ కీ సబ్జీ, కోరిస్ పావు వంటి వంటకాలు అందుబాటులో ఉంచనుంది.
రైల్వే స్టేషన్లోనే సూపర్ డార్మిటరీ
Ayodhya IRCTC Retiring Room : ఇక దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులకు మెరుగైన వసతి ఏర్పాట్లు కూడా చేయనుంది ఐఆర్సీటీసీ. రైల్వే స్టేషన్లోనే అందుబాటు ధరలకు రిటైరింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుడు రైలు దిగిన వెంటనే రిటైరింగ్ రూమ్‌లో బెడ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అవ్వవచ్చు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ఈ డార్మిటరీని సిద్ధం చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే హోటళ్లతో పోలిస్తే, డార్మిటరీలో బెడ్‌ను బుక్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుందని చెప్పొచ్చు. అందుకే ఐఆర్సీటీసీ ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు విషయాలపై ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడారు. "ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త రైల్వే స్టేషన్ భవనంలో రిటైరింగ్ రూమ్‌తో ఫుడ్ ప్లాజాల నిర్మాణం జరుగుతోంది. టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నాం. దీని ద్వారా పర్యటకులు అయోధ్యలోని సందర్శనాస్థలాల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు. 200 నుంచి 300 మంది కూర్చునే సౌకర్యం ఉండే రిటైరింగ్ రూమ్‌ను నిర్మిస్తున్నాం. వసతి గృహంలో వందల సంఖ్యలో బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ ప్లాజాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలు అందుబాటులో ఉంటాయి" అని తెలిపారు.
అయోధ్య మందిర నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం! భక్తుల సౌకర్యాలకు ప్రయారిటీ
అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు- 11 రోజుల్లో 25 లక్షల మందికి రామయ్య దర్శనం
అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?
అయోధ్య వాసుల 'సంజీవని'- 120 ఏళ్లుగా 'శ్రీరామ ఆస్పత్రి' సేవలు
అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్ - బస్, ఫ్లైట్ బుకింగ్స్‌పై 100% క్యాష్ బ్యాక్!