Rahul Gandhi On Budget : దేశంలో భయానక వాతావరణం నెలకొందని, BJP చక్రవ్యూహాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. దేశంలో BJP 'చక్రవ్యూహం' ద్వారా భయం వ్యాపిస్తోందని, అందులో రైతులు, కార్మికులతో సహా ఆ పార్టీ MPలు చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేలాది ఏళ్ల క్రితం హరియాణాలోని కురుక్షేత్రలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేసి ఆరుగురు ప్రాణాలు తీశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే కుల గణనను చేపట్టడం ద్వారా దాన్ని విపక్ష కూటమి విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, " my expectation was that this budget would weaken the power of this 'chakravyuh', that this budget would help the farmers of this country, would help the youth of this country, would help the labourers, small business of this country. but… pic.twitter.com/t5RaQn4jBq
— ANI (@ANI) July 29, 2024
"అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించి ఆరుగురు చంపారు. చక్రవ్యూహం గురించి నేను పరిశోధన చేశాను. నాకు దాన్ని పద్మవ్యూహం కూడా అంటారని తెలిసింది. చక్రవ్యూహం కమలం పువ్వు రూపంలో ఉంటుంది. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం తయారైంది. అది కూడా కమలం పువ్వు గుర్తులానే ఉంటుంది. ప్రధాని మోదీ తన ఛాతిపై ఆ చిహ్నాన్ని ధరిస్తారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఏం చేశారో, దేశాన్ని అదే చేశారు. దేశంలోని యువకులు, రైతులు, తల్లులు, సోదరీమణులు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలతో అదే చేశారు. ఈ రోజు కూడా చక్రవ్యూహంలో ఆరుగురే ఉన్నారు. చక్రవ్యూహంలో వేలాది మంది ఉంటారు. కానీ దాని మధ్యలో ఉన్న ఆరుగురు నియంత్రిస్తారు."
--రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత
భారతదేశాన్ని బంధించిన 'చక్రవ్యూహం' మూడు శక్తులను కలిగి ఉందని రాహుల్ చెప్పారు. అవి గుత్తాధిపత్య పెట్టుబడి, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, CBI, ED, IT వంటి సంస్థలని పేర్కొన్నారు. ఈ మూడు కలిసి 'చక్రవ్యూహం'లో ఉన్నాయని అవి దేశాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. అగ్నివీర్‌లను సైతం కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. వారి పింఛను కోసం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు.
"గతంలో నా మాటలతో కొందరు భయపడ్డారు. బీజేపీలో ఒక్క వ్యక్తే ప్రధాని కావాలని అనుకుంటారు. బీజేపీలో ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటే మరుక్షణం నుంచి వారు భయపడాల్సిందే. బీజేపీని చూసి దేశంలో అన్ని వర్గం భయపడుతున్నాయి. దేశంలో యువత, రైతులు, కార్మికులు అందరూ భయపడుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు ఎంఎస్‌పీ ఇస్తామని చట్టం చేయాలి. రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారు. రైతుసంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లు చేశారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారిపై అదనపు భారం వేశారు. వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదు. మా హయాంలో నిబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేశాం." అని రాహుల్ చెప్పారు.
#WATCH | LoP in Lok Sabha Rahul Gandhi says, " the 'chakravyuh' that has captured india has 3 forces behind it. 1) the idea of monopoly capital - that 2 people should be allowed to own the entire indian wealth. so, one element of the 'chakravyuh' is coming from the concentration… pic.twitter.com/hoRgjBOZkc
— ANI (@ANI) July 29, 2024
#WATCH | LoP in Lok Sabha Rahul Gandhi says, " thousands of years ago, in kurukshetra, six people trapped abhimanyu in a 'chakravyuh' and killed him...i did a little research and found out that 'chakravyuh' is also known as 'padmavuyh' - which means 'lotus formation'. 'chakravyuh'… pic.twitter.com/bJ2EUXPhr8
— ANI (@ANI) July 29, 2024