How To Prepare Multigrain Laddu : ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారంతో పాటు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది చపాతీలు చేసుకోవడానికి మల్టీ గ్రెయిన్ పిండిని వాడుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలా ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పిల్లలు వీటిని తిడనడానికి పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే వారికోసం ఇష్టమైన లడ్డూలు తయారు చేస్తే వదలకుండా లాగిస్తారు.
అయితే.. పోషకాలు సమృద్ధిగా ఉండే మల్టీ గ్రెయిన్ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు! ఈ స్టోరీలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీ గ్రెయిన్ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
మల్టీ గ్రెయిన్ లడ్డూలు తయారుచేయడానికి కావలసిన పదార్థాలు :
- ఓట్స్ - అరకప్పు
- గోధుమలు - అరకప్పు
- మొక్కజొన్న- అరకప్పు
- రాగులు - అరకప్పు
- శనగపప్పు - అరకప్పు
- నెయ్యి - అర కప్పు
- బెల్లం - మూడు కప్పులు
- డ్రై ఫ్రూట్స్ - అరకప్పు
- యాలకుల పొడి - ఒక స్పూను
సమ్మర్ స్పెషల్: ఈ మామిడి వంటకాలు తింటే వదలరు !
మల్టీ గ్రెయిన్ లడ్డూలను తయారు చేసే విధానం :
- ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి గోధుమలు, రాగులు, ఓట్స్, మొక్కజొన్న, శనగపప్పు అన్నీ బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
- తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఒక గిన్నెలో పోసుకోండి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి గ్లాసు వాటర్ పోసుకోండి. అందులోకి బెల్లం వేయండి.
- బెల్లం పాకంగా అయ్యే వరకు సన్నని మంట పెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు బెల్లం పాకాన్ని మల్టీ గ్రెయిన్ పొడిలో వేసి, స్పూన్‌తో బాగా కలపండి.
- ఈ మిశ్రమంలో యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపండి.
- తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైన డ్రైఫ్రూట్స్ కొన్ని కలుపుకోవచ్చు.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చేతితో లడ్డూలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఈ లడ్డూలను పొడిగా గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచాలి. లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.
- మల్టీ గ్రెయిన్ లడ్డూలను రోజూ ఉదయాన్నే పిల్లలకు ఇవ్వడం వల్ల వారు బలంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
- మరి ఇంకేందుకు ఆలస్యం.. హెల్దీ మల్టీ గ్రెయిన్ లడ్డూలను మీరు ప్రిపేర్ చేసుకోండి.