ETV Bharat / bharat

మునగ ఆకులు కోసుకుంటే ఎవ్వరూ వద్దనరు! - చక్కగా "మునగాకు రోటి పచ్చడి" చేసుకోండి! - నోటికి అమృతం, ఆరోగ్యానికి దివ్య ఔషధం! - Munagaku Pachadi Recipe - MUNAGAKU PACHADI RECIPE

Munagaku Roti Pachadi : చాలా మంది మునగ కాయలను మాత్రమే తింటారు. కొద్ది మంది మాత్రమే పప్పులో వేసుకుంటారు. కానీ.. మునగ ఆకులతో రోటి పచ్చడి చేస్తే.. అమృతమే అంటే నమ్మాల్సిందే! ఈ పచ్చడి ద్వారా రుచితోపాటు కాల్షియం, ఐరన్, ప్రొటీన్ దండిగా శరీరానికి అందుతాయి. మరి.. ఈ సూపర్ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

Munagaku Roti Pachadi
Munagaku Roti Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 12:50 PM IST

How To Make Munagaku Roti Pachadi : రోటి పచ్చళ్లనగానే మనలో చాలా మందికి టమాటా, దొండకాయ పచ్చళ్లే గుర్తుకొస్తుంటాయి. కానీ.. మునగ ఆకుతోనూ అద్భుతమైన పచ్చడి తయారు చేయొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాకుండా.. బాడీకి ఎన్నో విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు అందిస్తుంది. అలాగే.. ఈ పచ్చడిని ప్రిపేర్​ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా సింపుల్​గా, తక్కువ టైమ్​లోనే ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? టేస్టీ మునగకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో ఓ లుక్కేయండి!

మునగాకు రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు :

  • మునగాకు- రెండు కప్పులు
  • పచ్చిమిర్చి-8
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • పసుపు- చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మకాయ సైజు చింతపండు
  • మెంతులు-టీస్పూన్​
  • టమాటాలు- 2
  • జీలకర్ర-అర స్పూన్

తాళింపు కోసం..

  • 2 స్పూన్ల నూనె
  • స్పూన్ - ఆవాలు, జీలకర్ర
  • ఒక స్పూన్ మినపప్పు
  • రెండు ఎండు మిర్చి
  • కరివేపాకు

తయారీ విధానం..

  • ముందుగా మునగాకులను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌ ఆన్​ చేసి పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి పచ్చిమిర్చిలను వేయించుకోవాలి. వాటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్​లో మునగాకు వేసుకుని పచ్చి వాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి.
  • మునగాకు వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు టమాటా ముక్కలను వేసి కలిపి రెండు నిమిషాలు మూతపెట్టాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి.
  • టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్​ చేసి.. చల్లారనివ్వాలి.
  • మునగాకు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు నీటిలో నానబెట్టింది వేసుకోవాలి, అలాగే వేయించిన పచ్చిమిర్చిలను వేసుకుని రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు పాన్​లో ఆయిల్​ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని బాగా కలపాలి. అలాగే కరివేపాకు వేసుకుని మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్​ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే మునగాకు రోటి పచ్చడి మీ ముందు ఉంటుంది.
  • ఈ మునగాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి వేసుకుని తింటే టేస్ట్​ అద్భుతంగా ఉండటంతో పాటు, హెల్త్​ కూడా బాగుంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ సారి ఇంట్లో రోటి పచ్చడిని ట్రై చేయండి!

ఇవి కూడా చదవండి :

నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!

ఆంధ్రా స్టైల్ "దొండకాయ రోటి పచ్చడి" - ఇలా చేస్తే అదిరిపోద్ది - వేడి వేడి అన్నంలో కేక!

5 నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి - వేడి వేడి అన్నంలో అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.