ETV Bharat / bharat

పిండి రుబ్బకుండానే టేస్టీ దోశలు - ఇలా ప్రిపేర్​ చేస్తే నిమిషాల్లో రెడీ! - Instant Dosa

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 5:37 PM IST

Instant Dosa Breakfast : చాలా మందికి దోశలు అంటే ఇష్టం. కానీ వాటిని చేయాలంటే కొంచెం కష్టమైన వ్యవహారమే. ఎందుకంటే దోశలు వేయాలంటే ముందుగానే పిండి రుబ్బి పెట్టుకోవాలి. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా కేవలం నిమిషాల్లో దోశలు రెడీ అయితే! ఏంటి నమ్మలేకున్నారా? అయితే ఈ విధంగా ఓ సారి ట్రై చేయండి.

Instant Dosa
Instant Dosa Recipe In Telugu (ETV Bharat)

Instant Dosa Recipe In Telugu : ఇంట్లో అయినా లేదా టిఫెన్​ సెంటర్లో అయినా క్రిస్పీ దోశ తినడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇంట్లో దోశలు చేయాలంటే ముందుగానే పప్పును నానబెట్టి రాత్రి గ్రైండ్​ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఉదయానికల్లా దోశల పిండి రెడీ అవుతుంది. కానీ, డైలీ ఇలా చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే చాలా మంది వారానికి సరిపడా దోశల పిండిని రుబ్బుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటారు. అయితే, ఇవేవి లేకుండా ఇన్​స్టంట్​గా కేవలం 10 నిమిషాల్లోనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్​ తెలిస్తే దోశలు వేసుకోవడం ఇంత ఈజీనా అని ముక్కున వేలేసుకుంటారు.

గోధుమ పిండి దోశలు:

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమ పిండి- కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిల్లీ ఫ్లేక్స్​- టీస్పూన్​
  • పచ్చిమిర్చి-2
  • జీలకర్ర- అరటీస్పూన్​
  • కరివేపాకు- రెమ్మ
  • మిరియాల పౌడర్​- అరటీస్పూన్​

ఇన్​స్టంట్​ ​దోశలు తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్​లో గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, కట్​ చేసుకున్న కరివేపాకులు, కొత్తిమీర, పచ్చి మిర్చి, చిల్లీ ఫ్లేక్స్​ వేసుకుని కలుపుకోండి.
  • తర్వాత ఈ మిశ్రమంలోకి కొద్దికొద్దిగా నీళ్లు యాడ్​ చేసుకుంటూ.. దోశల పిండిలా జారులా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పాన్​ పెట్టి బాగా వేడైన తర్వాత పిండితో దోశలు వేసుకోండి. తర్వాత దోశ అంచల వెంబడి ఆయిల్​ వేసుకుంటూ.. రెండువైపులా దోరగా కాల్చుకుంటే సరిపోతుంది.
  • ఇలా చేస్తే.. ఎంతో టేస్టీ దోశలు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు.

పెరుగు, బేకింగ్​ సోడా లేకుండా రవ్వ దోశలు:

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం పిండి - ఒకటిన్నర కప్పు
  • పచ్చిమిర్చి- 3 (సన్నగా కట్​ చేసుకోవాలి)
  • కరివేపాకు-2
  • ఉప్పు -రుచికి సరిపడా
  • కొత్తిమీర- కొద్దిగా
  • క్యారెట్​ తురుము- కొద్దిగా
  • జీలకర్ర- టీస్పూన్​
  • ఉల్లిపాయలు- ఒకటి (సన్నగా కట్​ చేసుకోవాలి)
  • అరకప్పు- బొంబాయి రవ్వ
  • అల్లం తురుము- టేబుల్​స్పూన్​

బియ్యం పిండి దోశలు తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్​లో బియ్యం పిండి, బొంబాయి రవ్వ తీసుకోవాలి. అందులోకి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోకి అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్​ తురుము, కట్​ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకులు కట్​ చేసినవి, కొత్తిమీర, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే మరికొన్ని నీళ్లు పోసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది.
  • తర్వాత వేడివేడి దోశల పెనంపై పిండిని వేసుకుని, క్రిస్పీగా కాల్చుకుంటే సరిపోతుంది.
  • ఎంతో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే దోశలు రెడీ.
  • నచ్చితే మీరు కూడా టైమ్​ లేనప్పుడు ఈ ఇన్​స్టంట్​ దోశ రెసిపీలని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

దోశలు క్రిస్పీగా రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే హోటల్​ స్టైల్​ గ్యారెంటీ!

హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్​ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!

సొరకాయ దోశ ట్రై చేశారా?- బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.