ETV Bharat / bharat

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach - HAIR IN WOMAN STOMACH

Hair In Woman Stomach : ఓ మహిళ కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించి ఏదో గడ్డ ఉందని అనిపించి ఆపరేషన్​ చేశారు. ఆ మహిళ కడుపులో నుంచి తీసిన గడ్డను చూసి ఒక్కరిగా షాక్​కి గురయ్యారు. ఆ గడ్డ మొత్తం రెండున్నర కిలోల వెంట్రుకలే. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Hair In Woman Stomach
Hair In Woman Stomach (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 12:48 PM IST

Hair In Woman Stomach : కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళను పరీక్షించిన వైద్యులకు ఊహించని అనుభవం ఎదురైంది. వైద్యులు ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో ఏదో పెద్ద గడ్డ ఉన్నట్టు కనిపించింది. దీంతో ఆ మహిళకు ఆపరేషన్​ చేస్తుండగా డాక్టర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ మహిళ కడుపులో నుంచి ఏకంగా 2.5 కిలోల వెంట్రుకలు బయటపడ్డాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

ఇది జరిగింది
ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాకు 25ఏళ్ల మహిళకు, ప్రసవం తర్వాత తరచూ కడుపు నొప్పి వస్తుండేది. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ, ఎక్కడికెళ్లినా కడుపునొప్పి తగ్గలేదు. దీంతో మధ్యప్రదేశ్​ సత్​నా జిల్లాలోని జానకీకుండ్​ ఆస్పత్రికి ఆ మహిళను తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ, బాధితురాలికి డాక్టర్ నిర్మల వైద్య పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఏదో గడ్డ ఉన్నట్లు స్కానింగ్​లో కనిపించింది. దీంతో మహిళలకు ఆపరేషన్​ చేసి కడుపులో ఉన్న గడ్డను బయటకు తీశారు. దాన్ని చూసి వైద్యులు ఒక్కసారిగా షాక్​కు​ గురయ్యారు. అది గడ్డ మొత్తం రెండన్నర కిలోల వెంట్రుకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Hair In Woman Stomach
మహిళ కడుపులో ఉన్న రెండన్నర కేజీల జట్టు (ETV Bharat)

ఆ సమయంలోనే అలవాటు
అయితే ఆ మహిళ గర్భంతో ఉన్నప్పుడు వెంట్రుకలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసిందని డాక్టర్ నిర్మల తెలిపారు. 'గర్భంతో ఉన్నప్పుడు మహిళలు కొన్ని పదార్థాలు తినడానికి ఇష్టపడతారు. కొంతమంది పుల్లనివి, మరికొంతమంది తీపి పదార్థాలు తింటారు. అయితే ఈ మహిళ రెండోసారి గర్భం దాల్చినప్పుడు జట్టును తినడాన్ని అలవాటు చేసుకుంది. అయితే ఈ అలవాటు ప్రసవం తర్వాత మానేసినందని, ఆ తర్వాతే కడుపులో నొప్పి వచ్చిందని మహిళ తెలిపింది. ఈ అరుదైన మానసిక పరిస్థితిని 'ట్రైకోఫాగియా' అని అంటారు. ఎక్కువ శాతం ఈ అలవాటు చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది' అని డాక్టర్ నిర్మల తెలిపారు.

అమ్మాయి లంగ్స్​లో సూది- ఆపరేషన్​ లేకుండానేలంగ్స్​లో సూది 3 నిమిషాల్లో తీసిన డాక్టర్లు
14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న నాలుగు సెంటీమీటర్ల సూదిని ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే బయటకు తీశారు వైద్యులు. ఈ అరుదైన చికిత్సను కేవలం మూడున్నర నిమిషాల్లోనే నిర్వహించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

గుండు కొట్టించి మూత్రం తాగించిన బంధువులు- వీడియో తీసి నెట్టింట పోస్ట్- రూ.25 లక్షల డిమాండ్​! - Man Kidnapped By Relatives

ఫ్యామిలీలోని 8మందిని నరికి చంపిన కుటుంబ పెద్ద- ఆపై ఇంట్లోనే సూసైడ్ - Mass Murder Case Today

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.