ETV Bharat / bharat

'మహా వికాస్ అఘాడీలో తీవ్ర అసంతృప్తి - మహాయుతిలోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలు!'

మహా వికాస్ అఘాడీలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న ఎన్​సీపీ చీఫ్​ విప్ అనిల్ పాటిల్ - రాబోయే నాలుగు నెలల్లో 5 నుంచి 6 ఎమ్మెల్యేలు మహాయుతి కూటిమిలోకి చేరుతార్న ఎన్​సీపీ నేత

MVA Unrest In Maharashtra
MVA Unrest In Maharashtra (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 9:37 AM IST

MVA Unrest In Maharashtra : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) శిబిరంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఎన్​సీపీ చీఫ్ విప్ అనిల్ పాటిల్ అన్నారు. వచ్చే నాలుగు నెలల్లో ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార మహాయుతిలో చేరుతారని పేర్కొన్నారు

"కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎన్​సీపీ (ఎస్​పీ), కాంగ్రెస్, శివసేన (యూబీటీ) ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాతో సత్సంబంధాలు ఉన్నవారు మహా వికాస్ అఘాడీ ఓటమిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సవ్యంగా జరగాలంటే, అధికారంలో ఉండటం మంచిది. ఎంవీఏ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారు." అని ఎన్​సీపీ చీఫ్ విప్ అనిల్ పాటిల్ వ్యాఖ్యానించారు.

'ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుంటాం'
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఎన్​సీపీ(ఎస్​పీ) నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు. సమర్థవంతమైన, అందరినీ కలుపుకునిపోయే ప్రగతిశీల మహారాష్ట్ర కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

"అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల ఆదేశాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాం. ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుంటాం. నిజాయితీ, కృషి, మేము కట్టుబడే విలువలకు అనుగుణంగా పార్టీని పునర్నిర్మిస్తాం. రైతులు, కార్మికులు, మహిళలు, యువత, సమాజంలోని అట్టడుగు వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే వంటి సంఘ సంస్కర్తల ఆశయాలను ఎన్ సీపీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలు. మీరు అంకితభావంతో మహారాష్ట్రకు సేవ చేస్తారని, ప్రతి పౌరుడి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం." అని సుప్రియా సూలే పేర్కొన్నారు.

'శిందేను సీఎంగా కొనసాగించాలి'
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి ఘన విజయం సాధించిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ శిందేనే కొనసాగాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని మంత్రి, శివసేన నేత దీపక్ కేసర్కర్ తెలిపారు. శిందే నాయకత్వంలో మహాయుతి బాగా పనిచేసిందని, అలాగే ఎన్నికల్లోనూ అద్భుతంగా రాణించిందని అభిప్రాయపడ్డారు. అయితే సీఎం పోస్టుపై శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్ (బీజేపీ), అజిత్ పవార్ (ఎన్‌ సీపీ) కలిసి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మహారాష్ట్రకు మేలు చేస్తుందని వెల్లడించారు.

శివసేన శాసనసభాపక్ష నేతగా శిందే
కాగా, ముంబయిలో ఆదివారం రాత్రి శివసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్ నాథ్ శిందేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 57 మంది ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు. శిందేను అభినందించడం, ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపే మూడు తీర్మానాలను ఆమోదించారు.

కాగా, ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ 46 స్థానాలకే పరిమితమైంది. మహాయుతి సునామీతో ఎంవీఏ డీలా పడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.