ETV Bharat / bharat

వరుడి వినూత్న నిర్ణయం- పెళ్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్- 70 మంది రక్తదానం

Blood Donation Camp At Wedding In Bihar తన వివాహం సందర్భంగా బిహార్​కు చెందిన ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయించాడు. వేడుకకు హజరైన బంధువులు కూడా రక్తదానం చేసేలా ప్రోత్సహించాడు.

Blood Donation Camp At Wedding In Bihar
Blood Donation Camp At Wedding In Bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 1:03 PM IST

Blood Donation Camp At Wedding In Bihar : సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే బంధుమిత్రులను పిలిచి విందు, డీజే డ్యాన్స్​లతో కోలాహలంగా జరుపుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా రూ.లక్షలు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్​గా వివాహం చేసుకుంటారు. అయితే బిహార్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి రోజున వినూత్నమైన పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Blood Donation Camp At Wedding In Bihar
పెళ్లికి హజరై రక్తదానం చేస్తున్న వ్యక్తి

70 మంది రక్తదానం
ఔరంగాబాద్​ జిల్లాలోని హస్​పురా గ్రామానికి చెందిన అనీశ్ కేశరి, ఆరా ప్రాంతానికి చెందిన స్రిమాన్​ కేశరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వరుడు అనీశ్​ తన పెళ్లి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్​ను ఏర్పాటు చేయాలని వధువు కుటుంబాన్ని అడిగాడు. అతడు కోరినట్టే వివాహం రోజున మండపం దగ్గరే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధువు కుటుంబీకులు. వధూవరులతో పాటు పెళ్లికి హజరైన వారితో కలిపి 70 మంది వరకు రక్తదానం చేశారు. పెళ్లి రోజున చేసిన రక్తదానం తనకు 14వ సారి అని అనీశ్ తెలిపాడు.

Blood Donation Camp At Wedding In Bihar
రక్తదానం చేస్తున్న బంధువులు

"నేను తరచుగా రక్తదానం చేస్తూ ఉంటాను. అలానే నా పెళ్లిలో కూడా చేశాను. ఇంకా ఇలానే చేస్తూ ఉంటాను. నేను రక్తదానం చేయటం ఇది 14వ సారి. నా భార్య సిమ్రాన్ కేశరి బ్లడ్ డొనేట్​ చేయటం ఇది తొమ్మిదో సారి."
- అనీశ్ కేశరి, వరుడు

"పెళ్లిలో ఇలా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి కావచ్చు. సాధారణంగా వరుడు కట్నం కావాలని డిమాండ్ చేస్తారు. కానీ అనీశ్ కేశరి మాత్రం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని అడిగాడు. నేను కూడా రక్తం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది."
- సిమ్రాన్ కేశరి, వధువు

రక్తవీర్ యోద్ధా జిల్లా కమిటీ సహకారంతో అనీశ్ తన పెళ్లి వేడుకలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయించాడు. వధువు, వరుడు తరపున వాళ్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని డాక్టర్ రాకేశ్ రంజన తెలిపారు. నిరామయ బ్లడ్ బ్యాంక్, పట్నాకు చెందిన గణేష్ భగత్ బృందం ఈ క్యాంప్​ను విజయవంతం రంజన వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.