ETV Bharat / bharat

పరారీలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ- ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లి చూడగా! - Bhavani Revanna Absconding

Bhavani Revanna Absconding : ప్రజ్వల్​ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజ్వల్​ తల్లి భవానీ రేవణ్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Bhavani Revanna Absconding
Bhavani Revanna Absconding (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 7:23 AM IST

Updated : Jun 2, 2024, 7:29 AM IST

Bhavani Revanna Absconding : కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లౌంగిక వేధింపుల కేసులో సిట్​ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజ్వల్​ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణపైన కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా భవానీ రేవణ్ణ అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం.

అరెస్ట్ చేసే అవకాశం ఉందని!
రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌కు సంబంధించిన ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆమెను విచారించేందుకు సిట్‌ అధికారులు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. ఆదివారం ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవాని అక్కడ లేరు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి ఆమె ముందస్తు బెయిల్‌ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అందుకే పరారైనట్లు తెలుస్తోంది.

ఎన్నికలు జరిగిన తర్వాత రోజే!
హసన్​లో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన మరుసటిరోజే ఈ అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అయితే అప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపైన కూడా ఆరోపణలు రావడం వల్ల పోలీసులు ఆయన్ను కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత రేవణ్ణపై బెయిల్‌పై విడుదలయ్యారు.

కాగా, అశ్లీల వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో ప్రజ్వల్‌ లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ సహా కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్​కు తిరిగివచ్చిన ప్రజ్వల్​ను గురువారం అర్ధరాత్రి దాటాక అధికారులు ఎయిర్‌పోర్టులోనే మహిళా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరు కోర్టులో జూన్​ 6 వరకు కస్టడీ విధించింది.

దీదీ, నవీన్​కు షాక్​- కేరళలో బీజేపీ బోణీ- కర్ణాటకలో కాషాయ రెపరెపలు! - Exit Poll 2024 Lok Sabha

లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​- మూడోసారి మోదీయే! అన్ని సర్వేల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు!! - Lok Sabha Elections 2024

Last Updated : Jun 2, 2024, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.