Arvind Kejriwal ED Case : దిల్లీ జల్‌బోర్డ్ అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. దీనిపై స్పందించిన అమ్ ఆద్మీ పార్టీ, ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని, చట్ట వ్యతిరేకంగా జారీ చేశారని ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిందని పేర్కొంది.
-
#WATCH | Mumbai: On ED summons to Delhi CM Arvind Kejriwal over Delhi Jal Board scam, Delhi Minister Saurabh Bharadwaj says, " Central govt feels that if Arvind Kejriwal goes out of Delhi and holds rally and meeting for INDIA alliance, hindrances for BJP will increase. So, they… pic.twitter.com/IFAWuiYGHF
— ANI (@ANI) March 18, 2024
'కావాలనే కొత్త కేసులు'
ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. 'అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమితో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే బీజేపీకి ఆటంకాలు వస్తాయని భావిస్తోంది. కేజ్రీవాల్‌ను ఎలాగైనా జైలుకి పంపించాలని అనుకుంటుంది. దిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చే సరికి కొత్త కేసును తీసుకొచ్చారు." అని సౌరభ్ విమర్శించారు.
మరోవైపు ఈడీ విచారణకు కేజ్రీవాల్ కావాలనే గైర్హాజరయ్యారని బీజేపీ నేత హరీశ్ ఖురానా అన్నారు. 'సీఎం కేజ్రీవాల్‌కు చట్టం అంటే గౌరవం లేదనే విషయం మరోసారి రుజువైంది. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే విచారణ నుంచి తప్పించుకుంటున్నారు' అని హరీశ్ విమర్శించారు.
మరోవైపు జల్‌బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ ఈ విచారణకు గైర్హాజరయ్యారు. కాగా, మనీలాండరింగ్ చట్టం కింద కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన రెండో కేసు ఇది. ఇప్పటికే దిల్లీ మద్యం కేసులో ఆయనపై అభియోగాలు ఉండటం వల్ల ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న సత్యేందర్‌ను వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా లొంగిపోయేందుకు అనుమతించాలంటూ జైన్ తరఫు న్యాయవాది కోరిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2017లో అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్‌పై కేసు నమోదయ్యింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ సైతం ఆయనపై కేసు నమోదు చేసింది. జైన్‌కు చెందిన నాలుగు కంపెనీలలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో జైన్‌ను 2023 మే 30న అరెస్ట్ చేసింది.
'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'
పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా 9మంది మృతి