Andhra Style Pappu Charu Recipe : వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మంది వేడివేడి అన్నం తినడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే, అన్నంలోకి ఎన్ని కూరలున్నా కూడా కొంతమందికి పప్పు చారు లేనిదే ముద్ద దిగదు! వేడివేడి అన్నంలోకి సాంబార్ పోసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే, కొంతమందికి పప్పు చారు సరిగ్గా చేయడం రాదు. ఎన్ని సార్లు చేసినా ఏదో మిస్స్ అయిన ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తూ పప్పు చారు చేశారంటే.. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే వేడివేడి పప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
- కందిపప్పు- అర కప్పు
- నీళ్లు - సరిపడా
- పసుపు- అర టీస్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఇంగువ -చిటికెడు
- ఎండుమిర్చి-2
- పచ్చిమిర్చి-3
- సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
- కరివేపాకు రెమ్మ- 1
- మునక్కాడ ముక్కలు-10
- టమాటలు - 2
- కొత్తిమీర - కొద్దిగా
- బెల్లం పొడి- టేబుల్ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం- టేబుల్ స్పూన్
- ధనియాల పొడి- టీస్పూన్
- చింతపండు - 50 గ్రాములు
సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్ సూపర్! తింటే వదిలిపెట్టరు!
పప్పు చారు తయారీ విధానం :
- ముందుగా కందిపప్పు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి కడిగిన కందిపప్పు వేసి, రెండు కప్పుల నీళ్లు, కొద్దిగా పసుపు యాడ్ చేసి సన్నని మంట మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- తర్వాత ఉడికించుకున్న పప్పుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ పప్పు చారులో వేసుకోవడం వల్ల రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది.
- తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, శనగపప్పు వేసుకోవాలి.
- పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి.
- అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మునక్కాడ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు టమాట ముక్కలు వేసి మునక్కాడలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
- టమాటలు, మునక్కాడలు ఉడికిన తర్వాత చింత పండు పులుసు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి పులుసు బాగా మరగనివ్వాలి. పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది.
- పులుసు మరిగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పును వేసుకుని, రెండు గ్లాసుల నీరు పోసుకుని ఒక పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి.
- పప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే నచ్చితే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు పప్పు చారుని ఉడికించుకున్న తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది.
- అంతే ఇలా సింపుల్‌గా పప్పు చారు రెడీ చేసుకోవచ్చు. నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి.
- వేడి వేడి అన్నంలోకి పప్పుచారు పోసుకుని పక్కన వడియాలతో నంజుకుని తింటుంటే ఆ రుచే వేరు..
బ్రెడ్‌తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!
టేస్టీ అండ్ స్పైసీ "బేబీ కార్న్ మంచూరియా" - ఇలా చేశారంటే ప్లేట్లు ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!