Allahabad HC on SC And ST Act : ఒక వ్యక్తిని బహిరంగంగా బెదిరించడం లేదా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రమే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశంలో ఈ చర్య జరగకపోతే ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని తెలిపింది. దీనిని మరో సెక్షన్ల కింద నమోదు చేయాలని చెప్పింది. ఇంట్లోకి ప్రవేశించి కులపరమైన వ్యాఖ్యలు చేశారంటూ తనపై నమోదైన ఫిర్యాదును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన పింటూ సింగ్ అలియాస్ రాణా ప్రతాప్ సింగ్‌పై ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) కింద కేసు నమోదైంది. పింటూ సింగ్ తన ఇంట్లోకి ప్రవేశించి కులపరంగా దూషిస్తూ కొట్టారని ఓ వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ ఫిర్యాదును సవాల్ చేస్తూ పింటూ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన బహిరంగ ప్రదేశంలో జరగలేదని, ఫిర్యాదుదారుడి ఇంట్లోనే జరిగిందని హైకోర్టుకు తెలిపారు. ఎస్సీ,ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఘటన ఇంట్లో జరిగిందని, బయటి వ్యక్తి ఎవరూ లేరని, అటువంటి సందర్భాల్లో ఎస్సీ/ఎస్టీ చట్టంలోని నిబంధనలు వర్తించవి జస్టిస్ విక్రమ్ డి చౌహాన్ పేర్కొన్నారు. ప్రైవేట్ చేసిన వ్యాఖ్యలతో ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోలేమని, పబ్లిక్‌లో వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తల్లికి కుమార్తె భరణం చెల్లించాలి: ఇందౌర్ హైకోర్టు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసిన వృద్ధురాలి భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది. తల్లితో వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయించేలా చేసింది. తండ్రి భవిష్య నిధి ఖాతాలోని డబ్బును కూడా తీసుకుంది. 2020 మార్చిలో కొవిడ్ వల్ల ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు తల్లిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి తరిమేసింది. దీంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు ఆదాయం ఆర్జిస్తోందని పిటిషన్‌లో వృద్ధురాలు పేర్కొంది. దాంతో తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని కోర్టు తేల్చింది. వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పు వెలువరించారు.
'అమేఠీ, రాయ్‌బరేలీ సీట్లు కాంగ్రెస్‌వే- ఎంత మెజారిటీ వస్తుందంటే!!' - Lok Sabha Elections 2024
2024 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ప్రశాంత్ కిషోర్! - Lok Sabha Elections 2024