78th Independence day 2024 : దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీలో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 6వేల మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఈ క్రమంలో ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 2047 వికసిత భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు.
కాగా, 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఏకధాటిగా 98 నిమిషాలు ప్రసంగించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇంత సుధీర్ఘంగా ప్రసంగించలేదు.
PM Modi inspects Guard of Honour at the Red Fort on the occasion of 78th Independence Day. #IndependenceDay2024 pic.twitter.com/n42IXVH1N0
— Press Trust of India (@PTI_News) August 15, 2024
VIDEO | PM Modi (@narendramodi) pays homage to Mahatma Gandhi at Rajghat on Independence Day. The PM will hoist the national flag at Red Fort shortly.#IndependenceDay2024
— Press Trust of India (@PTI_News) August 15, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/yfy0ak3QAa
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని రక్షణ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనతంరం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.
VIDEO | PM Modi hoists national flag from the ramparts of the iconic Red Fort on the occasion of 78th Independence Day. #IndependenceDay2024 pic.twitter.com/s1WTNyRSAX
— Press Trust of India (@PTI_News) August 15, 2024
VIDEO | Advanced Light Helicopters (ALH) of the Indian Air Force (IAF) shower flower petals during Independence celebrations at the iconic Red Fort.#IndependenceDay2024
— Press Trust of India (@PTI_News) August 15, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ofOPjyvq4G
అతిరథ మహారథులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎమ్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు, సర్పంచ్‌లు సహా ఈ వేడుకలకు 6వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. కేంద్ర మంత్రలు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీఏ మిత్ర పక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథుల్లో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాల ద్వారా రాణించిన విద్యార్థలు, యువత, మహిళలు, రైతలు, సామాజిక కార్యకర్తలు సహా వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులు పాల్గొన్నారు. అతిథుల్లో గిరిజన కళాకారులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల కార్మికులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు రెండు వేల మంది తమ సాంప్రదాయ దుస్తులను ధరించి వేడకకు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలు 3వేల మంది, ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్ వింగ్, ఎన్సీసీ క్యాడెట్స్ 2వేల మంది ఈ వేడుకల్లో భాగమయ్యారు.
VIDEO | Union Ministers, foreign dignitaries and common man among attendees at Red Fort on the 78th Independence Day. #IndependenceDay2024 pic.twitter.com/2HgEJEvOQA
— Press Trust of India (@PTI_News) August 15, 2024
కాంగ్రెసేతర తొలి ప్రధాని మోదీయే
ఈ వేడుకల్లో మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. వరుసగా 11వ సారి ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన మోదీ ఎక్కువ సార్లు పత్కావిషరణ మూడో ప్రధానిగా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఘనతను సాధించిన తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ ఉన్నారు. 1947-64 వరకు 17 సార్లు జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ 16 సార్లు ప్రధానిగా తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీయే ఈ ఘనతను సాధించారు. అంతేకాకుండా పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా ఎక్కువసార్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర ప్రధానుల్లోమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు.
మువ్వన్నెల మోదీ టర్బన్!
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక మల్టీకలర్ రాజస్థానీ లెహెరియాప్రింట్ ఉన్న టర్బన్‌ను ధరించారు. కాషాయం, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిని టర్బన్ ధరించారు. తెలుపు కుర్తా, చుడీదార్పై బ్లూ జాకెట్‌ను వేసుకున్నారు. కాగా, ప్రధాని మోదీ 2014 నుంచి టర్బన్‌ను స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ధరిస్తున్నారు. అదే ఆనవాయితీని గురువారం కొనసాగించారు.
#WATCH | PM Modi as he left from his official residence for Red Fort to address the nation on 78th #IndependenceDay pic.twitter.com/wrPo7v9znm
— ANI (@ANI) August 15, 2024