ETV Bharat / bharat

వాంటెడ్​ క్రిమినల్​ను పట్టిస్తే 'పావలా' రివార్డ్​- పోలీసులు ఎందుకిలా చేశారంటే?

వాంటెడ్ నేరస్థుడిపై పావలా(25 పైసలు) రివార్డ్​ ప్రకటించిన రాజస్థాన్​ పోలీసులు- ఇలా ఎందుకు చేశారంటే?

25 Paise Reward For Criminal
25 Paise Reward For Criminal (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

25 Paise Reward For Criminal : సాధారణంగా పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటిస్తారు పోలీసులు. అందులో చిన్నాచితకా నేరగాళ్ల గురించి సమాచారం అందించిన వారికి రూ.వేలల్లో రివార్డులు ఇస్తారు. ఇక పేరు మోసిన నేరచరితులకు ఈ రివార్డు రూ.లక్షల్లో ఉంటుంది. దీనికి పూర్తిగా భిన్నంగా ఓ క్రిమినల్​పై పావలా(25 పైసలు) రివార్డు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు రాజస్థాన్​ పోలీసులు. అయితే ఆ నేరస్థుడు చిన్నాచితకా నేరాలు చేశాడా- అంటే అదీ కాదు. అతడిపై హత్యాయత్నం, దాడి, ఎస్​సీ/ఎస్​టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. మరి ఆ నేరస్థుడికి ఇంత తక్కువ రివార్డు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనే విషయంపై ఎస్​పీ స్పష్టత ఇచ్చారు.

పావలా నేరస్థుడు ఇతడే!
భరత్​పుర్ జిల్లా లఖన్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఈ గ్రామనికి చెందిన ఖుబీ రామ్​ జాట్​పై(48) హత్యాయత్నం, దాడి, ఎస్​సీ/ఎస్​టీ అట్రాసిటీ చట్టం ఉల్లంఘన కింద మూడు కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఖుబీ రామ్​కు ఎన్నిసార్లు సమన్లు పంపినా పోలీస్​ స్టేషన్​కు హాజరు కాలేదు. గత 7-8 నెలలుగా పరారీలో ఉన్నాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు అతడి కోసం గాలించారు. అయినా ఖుబీ రామ్ ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో నేరస్థుడిపై రివార్డు ప్రకటించాల్సిందిగా పోలీస్​ స్టేషన్​ నుంచి సూపరింటెండెంట్​ కార్యాలయానికి ప్రతిపాదన వెళ్లింది. దీంతో ఎస్​పీ మృదుల్ కచావా నేరస్థుడు ఖుబీ రామ్​ జాట్​పై 25 పైసలు రివార్డు ప్రకటించారు.

25 Paise Reward For Criminal
నేరస్థుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసుల 25 పైసలు రివార్డ్​ ప్రకటన (ETV Bharat)

ఎస్​పీ క్లారిటీ
తీవ్ర నేరారోపణలు ఉన్న వ్యక్తిపై పావలా రివార్డు ప్రకటించడంపై భరత్​పుర్ ఎస్​పీ మృదులు కచావా క్లారిటీ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే రివార్డు ప్రకటించామని చెప్పారు. ఇది నేరస్థుడిని అవమానించడానికి కాదు అని తెలిపారు. అతడు గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న కారణంగా రివార్డ్​ ప్రకటించడం స్టాండర్డ్​ ప్రక్రియ అని వెల్లడించారు.

అయితే దీనిపై పోలీసు శాఖలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అంతర్గత పోలీసు వర్గాల సమాచారం ప్రకారం- నేరస్థులను తక్కువ చేసి చూపడానికి, వారు కోరుకునే గుర్తింపునకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన పనిలో భాగమే ఈ ప్రకటన అని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.