తెలంగాణ

telangana

త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కాంగ్రెస్​-ఎన్​సీపీ

By

Published : Nov 20, 2019, 4:57 PM IST

Updated : Nov 20, 2019, 8:55 PM IST

కీలక భేటీలతో 'మహా' ఉత్కంఠ

20:48 November 20

''మహా'లో స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

మహారాష్ట్రలో కాంగ్రెస్​-ఎన్​సీపీ సమావేశం ముగిసింది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు ప్రకటించారు కాంగ్రెస్​ నేత పృథ్వీరాజ్​ చవాన్. చర్చలు ఇంకా కొనసాగుతాయని.. త్వరలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. 

మహారాష్ట్రలో కచ్చితంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు అవసరముందని వ్యాఖ్యానించారు ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన ఒక్కటి కాకుంటే ఇది సాధ్యం కాదన్నారు. సమస్యల్ని పరిష్కరించుకొని.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మాలిక్​. 

18:27 November 20

కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతల సమాలోచనలు

కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు దిల్లీలోని పవార్​ నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్​ సీనియర్లు అహ్మద్​ పటేల్​, జైరాం రమేశ్​, మల్లికార్జున్​ ఖర్గే, పృథ్వీరాజ్​ చవాన్​, కేసీ వేణుగోపాల్​, బాలాసాహెబ్​ థోరట్​ తదితరులు హాజరయ్యారు. ఎన్​సీపీలో సుప్రియా సూలే, అజిత్​ పవార్​, జయంత్​ పాటిల్​, నవాబ్​ మాలిక్​ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. 

17:07 November 20

పవార్​ నివాసానికి కాంగ్రెస్​ నేతలు

కాంగ్రెస్​-ఎన్​సీపీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్​ నేతలు.. దిల్లీలోని శరద్​ పవార్​ నివాసానికి చేరుకుంటున్నారు. 

16:59 November 20

మోదీతో పవార్​ భేటీ.. రైతు సమస్యలపైనేనా..!

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతు సమస్యలపై ప్రధానికి మూడు పేజీల లేఖ సమర్పించినట్లు పవార్ తెలిపారు. అయితే... మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశమైంది.

16:57 November 20

సేనతో కూటమికి సోనియా ఒప్పుకున్నట్లేనా..!

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమిపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. సేనతో కలిసేందుకు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. 

16:43 November 20

త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కాంగ్రెస్​-ఎన్​సీపీ

మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాని మోదీతో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ భేటీ అనంతరం.. నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ మహారాష్ట్ర సమన్వయ కమిటీ దిల్లీలో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్​-ఎన్​సీపీ భేటీ అనంతరం శివసేన నేత సంజయ్​ రౌత్... పవార్​ను కలవనున్నారు.

Last Updated : Nov 20, 2019, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details