ETV Bharat / spiritual

శుక్రవారం, మాస శివరాత్రి అరుదైన కలయిక! శివయ్యను ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు, దీర్ఘాయుష్షు! - Friday Masa Shivaratri Puja

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 6:41 PM IST

Friday Masa Shivaratri Puja In Telugu : పరమశివుని ఆరాధిస్తే శుభాలకు లోటుండదని శాస్త్ర వచనం. 'శివమ్' అనే పదానికి 'శుభం', 'మంగళకరం' అనే అర్థాలున్నాయి. అందుకే ఐశ్వర్యం కోరుకునేవారు తప్పకుండా శివారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం, మాసశివరాత్రి కలిసి వచ్చిన రోజు శివారాధనతో అఖండ ఐశ్వర్యాలు పొందవచ్చునని విశ్వాసం. మరి ఇంతటి విశేషమైన రోజు ఏ విధంగా శివారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Friday Masa Shivaratri Puja
Friday Masa Shivaratri Puja (ETV Bharat)

Friday Masa Shivaratri Puja In Telugu : వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి పూజ చాలా విశిష్టమైనది. ముఖ్యంగా శ్రావణమాసం సమీపించే ముందు వచ్చే మాస శివరాత్రి రోజు నియమానుసారం శివారాధన చేస్తే దారిద్య్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని విశ్వాసం. ఈసారి శుక్రవారం మాసశివరాత్రి రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు.

మాస శివరాత్రి పూజ ఏ రోజు చేస్తారు?
అమావాస్య ముందు ఏ రోజైతే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చతుర్దశి తిథి ఉంటుందో, ఆ రోజును మాసశివరాత్రిగా జరుపుకుంటాం.

మాస శివరాత్రి పూజకు శుభసమయం
ఆగస్టు 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3:27 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు మాస శివరాత్రి పూజకు శుభ సమయం.

మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో శివయ్యను అభిషేకించాలి. తర్వాత శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.

సంధ్యాసమయం పూజ
సాయంత్రం సంధ్యా సమయం అయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ పూర్తి చేసుకుని సమీపంలోని శివాలయానికి వెళ్లి ఆలయంలో జరిగే శివాభిషేకాలు, అర్చనలలో పాల్గొనాలి. శివునికి 11 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పూజారికి దక్షిణ తాంబులాలు ఇచ్చి నమస్కరించుకోవాలి.

ఉపవాస విరమణ
శివాలయం నుంచి ఇంటికి వచ్చి ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే మాస శివరాత్రి పూజ సంపూర్ణం అవుతుంది.

మాస శివరాత్రి పూజాఫలం
భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మాస శివరాత్రి రోజు శివారాధన చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా అమావాస్య ముందు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టడం, తీవ్రమవడం జరుగుతూ ఉంటుంది. అందుకే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు చేసే మాస శివరాత్రి పూజ అనారోగ్య సమస్యలను పోగొట్టి దీర్ఘాయుష్షును ఇస్తుందని లింగపురాణంలో శివ మహా పురాణంలో వివరించారు.

శుక్రవారం మాసశివరాత్రి విశిష్టత
ఇక ఈసారి శుక్రవారం, మాసశివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా ఈ రోజు నియమ నిష్టలతో చేసే శివారాధన వలన అష్టైశ్వర్యాలు సమకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. రానున్న మాస శివరాత్రి రోజు మనం కూడా భక్తి శ్రద్ధలతో శివయ్యను ఆరాధిద్దాం. అష్టైశ్వర్యాలను పొందుదాం.

శుభం భూయాత్. ఓం నమః శివాయ

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా? - Shiva Avatars

Namesమహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.