Tata Curvv EV Variants: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటం వల్ల చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఈ పండక్కి కొత్త ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ కారుపై ఓ లుక్కేయండి. ఈ కారును స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసింది.
కంపెనీ ఈ కారును రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య బడ్జెట్ ధరలోనే రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారును మొత్తం ఐదు ట్రిమ్ లెవెల్స్‌లో తీసుకొచ్చింది. ఇందులో క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ ఎ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
పవర్‌ట్రెయిన్, బ్యాటరీ అండ్ రేంజ్: టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S వేరియంట్స్ 45kWh యూనిట్‌తో అందుబాటులో ఉన్నాయి. వీటి MIDC-సర్టిఫైడ్ రేంజ్ 502 కిలోమీటర్లు. అంతేకాక అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ A వేరియంట్‌లు 55kWh బిగ్ బ్యాటరీతో వస్తున్నాయి. దీని MIDC రేంజ్ 585 కిలోమీటర్లు. వీటితో పాటు బిగ్ బ్యాటరీతో వస్తున్న వేరియంట్లో 165bhp శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. అయితే 45kWh ఒక్కటే 148bhp శక్తిని అందించే మోటార్‌ను కలిగి ఉంది.
Tata Curvv EV క్రియేటివ్ ఇతర ఫీచర్లు:
బ్యాటరీ: 45kWh
- LED హెడ్‌ల్యాంప్‌లు
- ఫ్లష్ డోర్ హ్యాండిల్
- 17-అంగుళాల స్టీల్ వీల్స్
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- ESP
- డ్రైవర్ డోస్ ఆఫ్ వార్నింగ్
- అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు
- ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
- రియర్ కెమెరా
- 7-అంగుళాల టచ్‌స్క్రీన్
- 7-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay
- ఆరు స్పీకర్లు
- పాడిల్ షిఫ్టర్స్ (రీజెన్)
- డ్రైవ్ మోడ్స్
- రియర్ AC వెంట్స్
- ఎలక్ట్రికల్ అడ్జిస్టబుల్ వింగ్ మిర్రర్
- ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ టెయిల్‌గేట్
- పవర్- అడ్జస్టిబుల్ డ్రైవర్ సీట్
- వెహికల్-టు- వెహికల్ ఛార్జింగ్ (V2V)
- వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ (V2L)
- TPMS
- iRA కనెక్ట్-టెక్
- ధర: రూ. 17.49 లక్షలు
Tata Curvv EV అకాంప్లిష్డ్ ఇతర ఫీచర్లు:
- బ్యాటరీ: 45kWh లేదా 55kWh
- ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్
- కనెక్టెడ్ టెయిల్-ల్యాంప్స్
- ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
- 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
- ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్
- 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
- నావిగేషన్‌తో 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే
- ఎనిమిది స్పీకర్లు
- ముందు, వెనక 45W ఛార్జర్
- లెథర్ అప్హోల్స్టరీ
- లెథర్ స్టీరింగ్ వీల్
- ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్
- అలెక్సా వాయిస్ అసిస్టెంట్
- ధర: రూ. 18.49 లక్షల నుంచి రూ. 19.25 లక్షలు
Tata Curvv EV అకాంప్లిష్డ్+ S ఇతర ఫీచర్లు:
- బ్యాటరీ: 45kWh లేదా 55kWh
- 360-డిగ్రీ కెమెరా
- బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్
- ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్
- పనోరమిక్ సన్‌రూఫ్
- JBL సౌండ్ మోడ్స్
- Arcade.ev యాప్ సూట్
- వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
- రెయిన్ సెన్సింగ్ వైపర్స్
- ఆటో హెడ్‌ల్యాంప్స్
- ఆటో డీఫాగర్
- ధర: రూ. 19.29 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు
Tata Curvv EV ఎంపవర్డ్+ ఇతర ఫీచర్లు:
- బ్యాటరీ: 55kWh
- ఛార్జింగ్ ఇండికేటర్‌తో కూడిన స్మార్ట్ డిజిటల్ లైట్
- 18-అంగుళాల అల్లాయ్ వీల్స్
- పరిసర లైటింగ్
- పవర్- అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
- సిక్స్-వే అడ్జస్టబుల్ కో-డ్రైవర్ సీటు
- వెనుక ఆర్మ్‌రెస్ట్
- 12.3-అంగుళాల హర్మాన్ టచ్‌స్క్రీన్
- తొమ్మిది-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్
- అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్
- ఎయిర్ ప్యూరిఫయర్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్
- వాలుగా ఉన్న వెనుక సీట్లు
- హుడ్‌లో ఫ్రాంక్
- ధర: రూ. 21.25 లక్షలు
Tata Curvv EV ఎంపవర్డ్+ A ఇతర ఫీచర్లు:
- ధర: రూ. 21.99 లక్షలు
- బ్యాటరీ: 55kWh
- పవర్డ్ టెయిల్ గేట్
- SOS కాల్
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
- లేన్ కీప్ అసిస్ట్
- బ్లైండ్ స్పాట్ డిటెక్షన్
- లేన్ ఛేంజ్ అలెర్ట్
- అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్
- ఫార్వర్డ్ కొల్లిజియన్ వార్నింగ్
- ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
- హై బీమ్ అసిస్ట్
- ట్రాఫిక్ సైన్ రికగ్నైషన్
- రియర్ కొల్లిజియన్ వార్నింగ్
- రియర్ క్రాస్-ట్రాఫిక్ అలెర్ట్
- వింగ్ మిర్రర్స్‌పై డోర్ ఓపెన్ అలర్ట్
మార్కెట్‌లో వీటికి పోటీ: ప్రస్తుతం టాటా కర్వ్ EV నేరుగా MG ZS EV (రూ. 18.98 లక్షలు- రూ. 25.44 లక్షలు)తో పోటీ పడుతోంది. అయితే ధరలో Nexon EV (రూ. 14.49 లక్షలు-రూ. 19.49 లక్షలు), మహీంద్రా XUV400 (రూ. 15.49 లక్షలు-రూ. 17.69 లక్షలు)తో పోటీ పడుతుంది.
మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనాలా?- త్వరలో రిలీజ్ కానున్న టాప్ మోడల్స్ ఇవే..!
టెక్ దిగ్గజం యాపిల్‌కు షాక్- ఆ దేశంలో ఐఫోన్16 బ్యాన్- ఎందుకంటే?