Paris Olympics 2024 SarabJot Singh : పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్ జోత్, మను బాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించి ఈ మెడల్‌ను ముద్దాడారు. ఈ విజయంతో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. దీంతో వీరిద్దరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే మెడల్ సాధించిన సరబ్‌జోత్ ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో సంతృప్తిగా లేనని చెప్పాడు.
"పారిస్ ఒలింపిక్స్‌లో నా ప్రదర్శనతో నేను సంతృప్తిగా లేను. నా లక్ష్యం నెరవేరేంతవరకు నేను సంతృప్తి చెందను. పారిస్ ఒలింపిక్స్ కోసం 8 ఏళ్లుగా సన్నద్ధం అవుతున్నాను. భారతదేశానికి ప్రాతినిథ్యం వహించడం నా కల. పతక ఈవెంట్ సమయంలో నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టాను. స్కూల్ డేస్ రోజుల్లో ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ ఆ తర్వాత షూటింగ్ వైపు నా ఆసక్తి పెరిగింది. దీంతో అందులోనే నా ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ వస్తున్నాను. మెడల్ సాధించడం కోసం ఎంతో శిక్షణ చేశాను. ఎంతో కష్టపడ్డాను. కానీ ఈ ఒలింపిక్ మెడల్ తర్వాత కూడా నేను సాధించాల్సింది చాలా ఉంది. అయితే ప్రస్తుతం కొంత సమయం కుటుంబంతో గడుపుతాను. అనంతరం 2028 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపై నా పూర్తి ఫోకస్ పెడతాను. ప్రతిరోజు నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. అందులో నా దినచర్య , నేను సాధించిన విజయాలు ఉంటాయి. ఫైనల్‌గా యంగ్ ప్లేయర్స్‌కు నేనిచ్చే సలహా ఏంటంటే నిరంతం తమ లక్ష్యం కోసం కృష్టి చేస్తూ కష్టపడండి. అస్సలు తమ ప్రయత్నాన్ని మధ్యలో విరమించొద్దు." అని అన్నాడు.
ఆయనే స్ఫూర్తి - సరబ్‌జోత్ స్వస్థలం హరియాణాలోని అంబాలా జిల్లా ధీన్ గ్రామం. ఇప్పుడు అతడి వయస్సు 22 ఏళ్లు. అయితే సరబ్‌జోత్ ఈ విజయం సాధించడానికి - హంగేరియన్ సైనికుడు, షూటర్ కరోలి టాకాక్స్ నుంచి పొందిన స్ఫూర్తినే కారణమట. ఈ విషయాన్ని ఆయన కోచ్ అభిషేక్ రానా తెలిపారు.
OLYMPIC BRONZE MEDALIST!! 🥉
— Sarabjot Singh (@Sarabjotsingh30) July 31, 2024
Very happy to have won a Bronze Medal along with @realmanubhaker in the 10M Air Pistol Mixed Team Event, for our country. It has been an amazing experience at @paris2024 Olympic Games, my first Olympics. This is just the start. pic.twitter.com/9TEm8j23LE
'ప్లీజ్ తినడానికి ఏమైనా ఇవ్వండి' - భారత ఒలింపిక్ విన్నర్ సరబ్ జోత్ - Paris Olympics 2024