'15లోపు సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి - సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు' - Tummala on Sitarama Project Start - TUMMALA ON SITARAMA PROJECT START
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 10:11 PM IST
Minister Tummala On Sitarama Project Works : సీతారామ ప్రాజెక్టు పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఇమామ్నగర్ వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఎన్ఎస్పీ అనుసంధాన కాలువ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని మళ్లించే విధంగా తక్కువ ఖర్చుతో కేవలం రూ. 70 కోట్లతో అనుసంధాన కాలువ నిర్మిస్తున్నామన్నారు.
ఈ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని, సాగర్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వనరుగా తోడ్పడుతుందన్నారు. ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. కాగా భూసేకరణ, గుజరాత్ పైప్లైన్ అనుమతులు, వర్షాల వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఆగస్టు 15 నాటికి మూడు పంప్ హౌస్లు పూర్తి చేస్తున్నామని, హెడ్ వర్క్స్ పంప్ హౌస్ పూర్తయిందన్న మంత్రి, కమలాపురం, పూసగూడెం పంప్ హౌస్లు సైతం ట్రైల్ రన్ కంప్లీట్ చేసినట్లు వివరించారు.