ETV Bharat / entertainment

అమితాబ్​ ఫ్యామిలీలో మరో బ్రేకప్​ - ఐశ్వర్య, అభిషేక్ మాత్రం కాదు! - Amitabh Bachchan Family Divorce - AMITABH BACHCHAN FAMILY DIVORCE

Abhishek Bachchan Aishwarya Rai Divorce : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్​ ఫ్యామిలీలో అభిషేక్ బచ్చన్​, ఐశ్వర్యా రాయ్​ డివోర్స్ తీసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్​ బీ ఫ్యామిలీ గురించి మరో వార్త బయటకు వచ్చింది! ఆ కుటుంబంలో మరో​ జంట బ్రేకప్ చేసుకోబోతుందంటూ తాజాగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI and Associated Press
Amitabh, Aishwarya Rai (source ANI and Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 7:29 PM IST

Abhishek Bachchan Aishwarya Rai Divorce : గత కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరద్దరూ ఇప్పటికే వేర్వేరుగా జీవిస్తున్నారని వార్తలు వచ్చాయి. 17 ఏళ్ల వైవాహిక బంధానికి అభిషేక్, ఐశ్వర్య గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే ఈ జంట గానీ, అమితాబ్ కుటుంబంగానీ ఈ వార్తలను ఖండించలేదు.

విడివిడిగా హాజరైన అభిషేక్, ఐశ్వర్యరాయ్ - మరోవైపు, జులైలో జరిగిన దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధిక పెళ్లికి అభిషేక్ తన కుటుంబంతో రాగా, ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చారు. దీంతో వీరి విడాకుల వార్తలు మరింత భగ్గుమన్నాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కుటుంబం గురించి మరోవార్త బయటకు వచ్చింది. ఈ వార్త అమితాబ్ అభిమానులను కలవరపెడుతోంది.

యువ హీరోతో డేటింగ్! - అమితాబ్ మనవరాలు(కుమార్తె కూతురు) నవ్య నవేలి నందా, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నవేలి, సిద్ధాంత్(Siddhant Chaturvedi and Navya Naveli) తరచుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఇప్పుడు నవేలి, సిద్ధాంత్ తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా ఉంటామని సన్నిహితుల దగ్గర వారు చెప్పినట్లు సమాచారం.

ఇక నవేలి విషయానికొస్తే వృత్తిపరంగా ఆమె లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లాభాపేక్షలేని సంస్థ ప్రాజెక్ట్ నవేలిని నిర్వహిస్తున్నారు. అలాగే ఆమె వాట్ ది హెల్ నవ్య అనే పాడ్‌ కాస్ట్​ను కూడా నడుపుతున్నారు. అలాగే సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ ఉంటూ మహిళలపై ఏదైనా ఘటనలు జరిగితే రియాక్ట్ అవుతుంటారు.

మరోవైపు, షాజియా ఇక్బాల్ తెరకెక్కిస్తున్న ధడక్ 2లో సిద్ధాంత్ చతుర్వేది నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రొమాంటిక్ మూవీ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐశ్వర్యారాయ్ దగ్గరున్న 5 లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు ఇవే- ఈమె ఆస్తి ఎన్ని కోట్లంటే? - Aishwarya Rai Net Worth

గాయంతో కేన్స్​కు ఐశ్వర్య - డెడికేషన్ అలాంటిది మరి! - Cannes Film Festival 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.