ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అభివృద్ధి అంటే భవనాలను కూల్చటమేనా..?: కళా వెంకట్రావు

By

Published : Oct 24, 2020, 8:46 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే నిర్మించిన భవనాలను కూల్చటం కాదని హితవు పలికారు.

tdp leader kala venkata rao
tdp leader kala venkata rao

కూల్చివేతల్లో జగన్ గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే కట్టిన భవనాలు కూల్చటం కాదని హితవు పలికారు. నాడు-నేడు కార్యక్రమాన్ని నాడు నిర్మించడం, నేడు కూల్చడంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు బదులు వైకాపా నిబంధనలు అమలవుతున్నాయని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details