ETV Bharat / sports

మూడో మెడల్​కు మను గురి- రికార్డు సృష్టించేనా? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Today India: పారిస్ ఒలింపిక్స్​లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన షూటర్ మనూ బాకర్ శుక్రవారం మూడో మెడల్​కు గురి పెట్టనుంది. మనుతోపాటు భారత అథ్లెట్లు శుక్రవారం (ఆగస్టు 02) పలు ఈవెంట్​లలో పాల్గొనున్నారు.

Paris Olympics 2024
Paris Olympics 2024 (Associated Press (Left), ETV Bharat (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 7:43 AM IST

Paris Olympics 2024 Today India: పారిస్ ఒలింపిక్స్​లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న 3 పతకాలు షూటింగ్ విభాగంలో వచ్చినవే. యువ షూటర్ మను బాకర్ 10మీటర్ల వ్యక్తిగత విభాగంలో, అలాగే మిక్స్​డ్ ఈవెంట్​లో సరబ్​జోత్ సింగ్​లో కలిసి కాంస్యం గెలుచుకుంది. పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్​లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్యాన్ని ముద్దాడాడు. తాజాగా రెండు ఒలింపిక్ పతకాల విజేత మను బాకర్ మూడో మెడల్​పై కన్నేసింది. శుక్రవారం ఆమె 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పాల్గొననుంది. ఈ పోరులో గెలిచి మను మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంటుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

బాకర్ రికార్డు సాధిస్తుందా?
ఆగస్టు 2న మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌ క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. భారత మరో షూటర్ ఈశా సింగ్​తో కలిసి మిక్స్​డ్ ఈవెంట్​లో మను బాకర్ పాల్గొననుంది. ఈ రౌండ్​లో మను క్వాలిఫై అయితే మరో పతకం ఆమె ఖాతాలో చేరుతుంది. అప్పుడు ఒలింపిక్స్​​ అత్యధిక పతకాలను సాధించిన అథ్లెట్​గా మను చరిత్ర సృష్టించనుంది.

మనుపై భారత్ ఆశలు
కాగా, ఇప్పటికే రెండు విభాగాల్లో మెడల్స్ గెలిచి జోరు మీద ఉన్న యంగ్ షూటర్ మనుపై భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కూడా రాణిస్తుందని అంటున్నారు. ఒకవేళ మను ఈ ఈవెంట్ లో కూడా గెలిస్తే అరుదైన రికార్డును సృష్టిస్తుంది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను రికార్డును బ్రేక్ చేసి మూడు ఒలింపిక్ మెడల్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది.

భారత అథ్లెట్లు శుక్రవారం పాల్గొనబోయే ఈవెంట్లు ఇవే
  • పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ ప్లేయర్లు శుభంకర్ శర్మ, గగన్ జీత్ భుల్లర్ గోల్ఫ్ లో ఆడనున్నారు.
  • స్కీట్ మెన్స్ విభాగంలో క్వాలిఫై రౌండ్ జరగనుంది. ఈ ఈవెంట్ లో అనంత్ నరుకా పాల్గొనున్నాడు.
  • ఆర్చరీలో భారత మిక్స్ డ్ జట్టు ఇండోనేసియాతో తలపడనుంది.
  • బలరాజ్ పన్వర్ రోయింగ్ ఈవెంట్ లో ఆడనున్నాడు.
  • జూడో, సెయిలింగ్ ఈవెంట్లలో భారత అథ్లెట్లు తలపడనున్నారు.
  • ఆస్ట్రేలియాతో భారత హాకీ జట్టు తలపడనుంది.

ముగిసిన పీవీ సింధు పోరాటం - ఒలింపిక్స్ నుంచి ఔట్ - Paris Olympics 2024 PV Sindhu

క్వార్టర్​ ఫైనల్​కు లక్ష్యసేన్​ - సాత్విక్, చిరాగ్ జోడీ, నిఖత్​కు షాక్​! - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.