Mr Bachchan Promotions HYD Metro: మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. ఈ రొమాంటిక్, యాక్షన్ డ్రామా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే సాధారణంగా కాకుండా మిస్టర్ బచ్చన్ టీమ్ కాస్త డిఫరెంట్‌గా సినిమాను ప్రమోట్ చేసింది. రవితేజ వాయిస్ మెసేజ్‌తో ప్రమోషన్స్ చేసి మూవీలవర్స్ను ఆకట్టుకుంది.
ప్రమోషన్స్ కోసం మూవీటీమ్ హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఎంచుకుంది. 'మెట్రో ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం. ఏం తముళ్లు మెట్రోలో ప్లేస్ దొరకలేదా? లేదా కూర్చోగానే లేపేస్తున్నారా? ఏం పర్వాలేదు. మిస్టర్ బచ్చన్ నుంచి లేటెస్ట్గా ఓ పాట రిలీజైంది. హ్యాపీగా వినుకుంటూ నిల్చోని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లిపోండి. ఇక్కడ సీట్ దొరక్కపోయినా పర్వాలేదు. ఆగస్టు 15న థియేటర్‌కు వచ్చేయండి. అక్కడ సీట్ గ్యారెంటీ' అని హీరో రవితేజ వాయిస్ మెసేజ్‌తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
#RaviTeja greets Hyderabad Metro Riders in a First of its kind Audio Promotions for a Telugu Movie!#MrBachchan pic.twitter.com/SLcF8ARhkO
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 1, 2024
కాగా, ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టీజర్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అటు పాటలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రవితేజ రొమాంటిక్ కోణాన్ని డైరెక్టర్ హరీశ్ శంకర్ సాంగ్స్‌లో బాగా చూపించారు. ఇక 1980-90ల్లో నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఒక నిజాయితిగల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిసున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక డైరక్టర్ హరీశ్ శంకర్ రవితేజ కలిసి గతంలో 'మిరపకాయ్' సినిమాతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో మరోసారి విడుదల కానున్న 'మిస్టర్ బచ్చన్' పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
'మిస్టర్ బచ్చన్' టీజర్ ఔట్- రవితేజ మాస్ జాతర - Mr Bachchan
'మిస్టర్ బచ్చన్' రిలీజ్ కూడా అదే రోజు- బాక్సాఫీస్ క్లాష్ - Mr Bachchan Release