How To Make Poori Without Oil In Telugu : ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో ఒకటి.. పూరీ. కేవలం టిఫెన్‌గా మాత్రమే కాదు పండగల టైమ్‌లో, ఇతర సందర్భాల్లో తినాలని అనిపించినప్పుడు కొంతమంది పూరీలు ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అయితే, అందరికీ తెలిసిందల్లా.. పూరీలను నూనెలో వేయించి చేసుకోవడమే. కానీ, ఆయిల్ లేకుండా కూడా పూరీలు చేసుకోవచ్చని మీకు తెలుసా? అదేంటి.. నూనె లేకుండా పూరీలు(Poori) ఎలా ప్రిపేర్ చేసుకుంటారని ఆలోచిస్తున్నారా? అవునండీ.. నిజమే ఆయిల్ లేకుండా కూడా ఎంతో టేస్టీగా ఉండే పూరీలను తయారు చేసుకోవచ్చు. పైగా నూనె లేనివి కదా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించవు! అలాగే.. ఇందుకు కావాల్సిన పదార్థాలు కూడా తక్కువే! మరి, ఇంకెందుకు ఆలస్యం నూనె లేకుండా పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- మైదాపిండి - ఒక కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - ఒకటిన్న చెంచా(పిండిలో కలుపుకోవడానికి)
- నీళ్లు - తగినన్ని
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో కప్పు మైదా పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత జల్లించుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర చెంచా ఆయిల్ వేసుకొని అవి పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి.
- ఆపై ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైనంత వరకు పిండి చాలా స్మూత్‌గా అయ్యే వరకు మెత్తగా కలుపుకోవాలి.
- అలా కలుపుకున్నాక పిండిపై మూత ఉంచి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. దీని వల్ల పిండి మెత్తగా, మృదువుగా అవుతుంది.
- తర్వాత మరోసారి ఆ పిండి బాగా కలుపుకొని.. నిమ్మకాయ సైజ్‌లో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అనంతరం చపాతీ పీట మీద పూరీల్లా వత్తుకోవాలి. అయితే, పూరీలు మరీ పెద్దగా కాకుండా కాస్త చిన్న సైజ్‌లో ఉండేలా చూసుకోవాలి.
- అలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పూరీల్లా చేసుకొని ప్లేట్లో ఉంచి పక్కన పెట్టుకోవాలి.
సూపర్ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం!
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి దానిపై ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి.
- ఆవిధంగా వాటర్ మరుగుతున్నప్పుడు.. ఇడ్లీ ట్రేలను తీసుకొని అందులో ఇడ్లీ పిండి మిశ్రమం ఉంచే ప్లేస్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొన్న పూరీలను ఉంచాలి.
- ఆ తర్వాత ట్రేలను ఇడ్లీ కుక్కర్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఆపై మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- అనంతరం కుక్కర్ మూత తీసి ట్రేలలో ఉన్న పూరీలను తిప్పి వేసుకొని మూత పెట్టి రెండో వైపు మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- ఆ విధంగా పూరీలను రెండువైపులా ఉడికించుకున్నాక.. ఇప్పుడు స్టౌపై ఒక మందపాటి పాన్ ఉంచి అందులో చిన్న స్టాండ్ దానిపై కేక్ బౌల్ పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఆ బౌల్లో ఇడ్లీ పాత్రలో ఉడికించిన పూరీలను వేసుకొని మూతపెట్టి 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
- అంతే.. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరంగా ఉండే ఆయిల్ లేని పూరీలు రెడీ!అనంతరం వాటిని వేడివేడిగా పూరీ కర్రీ లేదంటే ఇంకేదైనా చట్నీలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి.
ఇవీ చదవండి :
చపాతీలు పూరీలా ఉబ్బుతూ, మెత్తగా రావాలా? - ఈ టిప్స్ పాటిస్తే చాలు!
రాత్రివేళ పప్పు నానబెట్టాల్సిన పనిలేదు - ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు!