Credit Card vs Buy Now Pay Later : ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొనుగోళ్లపై భారీ ఆఫర్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీలు. అందులో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, బై నౌ పే లేటర్ వంటి ఆఫర్లు ఉంటాయి. ముఖ్యంగా పే లేటర్ అప్షన్స్ వల్ల, వస్తువులు కొనుగోలు చేసిన కొన్ని రోజులకు పేమెంట్ చేసే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. కాగా, ఈ ఆప్షన్స్ ఉపయోగించునేందుకు క్రెడిట్ కార్డు వాడాలా?, లేదా బౌ నౌ పే లేటర్ పద్ధతిలో కొనుగోళ్లు జరపాలా? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. అయితే, ఈ రెండింటిలో దేని ద్వారా కొనుగోలు చేసినా పెద్దగా తేడా ఉండదు.
రెండింటిలోనూ అవన్నీ ఉన్నా!
క్రెడిట్ కార్డు, బౌ నౌ పే లేటర్, రెండు పేమెంట్ ఆప్షన్లు కూడా కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులు చెల్లించడానికి కొంత సమయాన్ని ఇస్తాయి. ఈ రెండు పద్ధతుల్లో క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ లిమిట్ దాటితే, కొనుగోళ్లకు వీలుండదు. సరైన సమయంలో పేమెంట్ చేయలేకపోయినా, ఈ రెండు పద్ధతుల్లో పెనాల్టీలు విధిస్తారు.
రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్
క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లు జరిపితే రివార్డ్ పాయింట్లు వస్తాయి. బ్యాలన్స్ తిరిగి చెల్లించడానికి క్రెడిట్ కార్డులు 30-50 రోజులు గడువు ఇస్తాయి. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐని సౌకర్యాన్ని కూడా క్రెడిట్ కార్డులు కల్పిస్తాయి.
ఇక, బై నౌ పే లేటర్ ఆప్షన్ రివార్డ్ పాయింట్లు లభించవు. ఈ ఆప్షన్ ద్వారా కోనుగోళ్లు జరిపిన వాళ్లు, వాయిదా పద్ధతుల్లో బ్యాలన్స్ చెల్లించవచ్చు. కొన్నిసార్లు అదనపు ఛార్జీలు లేకుండానే ఈఎంఐల ద్వారా చెల్లించే ఛాన్స్ ఉంటుంది.
రెండింట్లో ఏది బెటర్?
మీకు క్రెడిట్ కార్డు ఉంటే, ఆన్ షాపింగ్ చేసేటప్పుడు ఆ కార్డు ఉపయోగించడం బెటర్. ఎందుకంటే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐను ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు లేకుంటే లేదా మీ క్రెడిట్ లిమిట్‌ను దాటినట్లైతే, బై నౌ పే లేటర్ ఆప్షన్ మంచి ప్రత్యామ్నాయం.
ఆన్‌లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips