Stickers On Fruits : మీరు మార్కెట్లో స్టిక్కర్‌తో ఉన్న ఆపిల్ పండు గమనిస్తే అది దాని నాణ్యత, ఖరీదు వివరాలను సూచిస్తుంది. సాధారణంగా స్టిక్కర్‌తో ఉన్న ఆపిల్ పండ్లు ఎగుమతి నాణ్యత కలిగినవని అర్థం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన వ్యాపారులు ధర, నాత్యతను వినియోగదారులకు తెలిపేందుకు స్టిక్కర్ ను ఉపయోగిస్తారు. కానీ, కొంత మంది వ్యాపారులు ఇదే అలుసుగా తీసుకుని రకరకాల నాణ్యత, ధరకు సంబంధం లేని స్టిక్కర్లు వేయడాన్ని కూడా మనం గమనించవచ్చు.
ప్రతి ఆపిల్‌ను స్టిక్కర్‌తో విక్రయించాలనే విషయం 99% మందికి తెలియదు. అయితే, ఇప్పుడు యాపిల్స్ మాత్రమే కాకుండా నారింజ పండ్లను కూడా స్టిక్కర్లతో అమ్ముతున్నారు. మెరిసే ఆపిల్స్, వాటిపై ఆకర్షణీయమైన స్టిక్కర్లు చూసి అవి నాణ్యమైనవి, ఖరీదైనవి అనుకుంటే మీరు పొరపడినట్టే. ఆపిల్స్ కొనే ముందు స్టిక్కర్‌ను పరిశీలించాలి. దానిపై ఉన్న కోడ్ ద్వారా వాటి నాణ్యత తెలుసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
కాల్చిన శనగలతో గుండెపోటుకు చెక్- ఆ వ్యాధి ఉన్నోళ్లకు డేంజర్! - ROASTED CHANA BENIFITS
మార్కెట్లో కొన్ని రకాల ఆపిల్స్‌పై స్టిక్కర్లు నాలుగు అంకెల సంఖ్యలు కలిగి ఉంటాయి. స్టిక్కర్లపై 4026 లేదా 4987 వంటి సంఖ్యలు ఉంటే అవి తక్కువ క్వాలిటీ కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆయా పండ్లను పురుగుమందులు, రసాయనాలను ఉపయోగించి పండించినట్లు తెలుసుకోవాలి. ఈ పండ్లపై తరచుగా పురుగుమందులు వాడడం వల్ల అవి తక్కువ ధరకు లభిస్తాయి. వాటిని తింటే, మీరు ఎరువులు, పురుగుమందులు ఉన్న పండ్లను కొనుగోలు చేస్తున్నట్లు అర్థం.
కొన్ని ఆపిల్ పండ్లపై 84131, 86532 వంటి 8తో మొదలయ్యే ఐదు అంకెల సంఖ్యలు ఉంటాయి. ఇలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లు జన్యుపరంగా మార్పు చెందినవని అర్థం. ఈ పండ్లు సహజమైనవి కాకపోయినా పురుగు మందులు వాడిన పండ్ల కంటే కాస్త బెటర్. పైగా ధర కూడా ఎక్కువే.
కొన్ని ఆపిల్ పండ్ల స్టిక్కర్లపై 9తో మొదలయ్యే ఐదు అంకెల కోడ్ ఉంటుంది. 93435 అని ఉంటే ఆ పండు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. అంటే పురుగుమందులు, రసాయనాలు ఉపయోగించకుండా పండించినవి కావడంతో ధర ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఒక్కో స్టిక్కర్‌కు ఒక్కో అర్థం ఉన్నా బహిరంగ మార్కెట్లో చాలా మంది వ్యాపారులు కంపెనీ పేరుతో నకిలీ స్టిక్కర్లను పండ్లపై అంటిస్తున్నారు. వీటికి నాణ్యత, ధరతో సంబంధం లేకున్నా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటూ అధిక ధరకు విక్రయించి మోసం చేస్తున్నారు. పండ్లను కొనుగోలు చేసేటప్పుడు స్టిక్కర్లను పరిశీలించి వాటి నాణ్యతను అంచనా వేయడం అనివార్యం.
ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు! - coriander health benefits
మధుమేహాన్ని తరిమికొట్టే మందులివే!- ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఉత్సాహమే - diabetes CONTROL food