ETV Bharat / state

రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today

IIT Teams Inspect Amaravati Constructions : ఐఐటీ బృందం అమరావతిలో పర్యటిస్తోంది. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌ నిపుణలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టవర్లను పరిశీలించారు.

IIT Teams Visit Amaravati Today
IIT Teams Visit Amaravati Today (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 8:26 AM IST

Updated : Aug 2, 2024, 3:20 PM IST

IIT Teams Visit Amaravati : రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి చేరుకున్నారు. టీడీపీ సర్కార్​లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వీటిని ఆపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.

AP Capital Amaravati Structures Status : ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాసు, ఐఐటీ హైదరాబాద్‌లకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత , ఇతర సాంకేతిక అంశాలను ఐఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు.

ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్లు సుబ్రమణ్యం, మున్వర్‌బాషా మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదికిస్తామని తెలిపారు. నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత, సామగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదికిస్తామని వారు వెల్లడించారు. అనంతరం సీఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సీఆర్డీఏ ముందుకు సాగనుంది.

మరోవైపు సెక్రటేరియట్, హెచ్​వోడీ కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్​లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను సర్కార్ ఐఐటీ మద్రాస్​కు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధానిలో అడవిని తలపిస్తున్న కంపచెట్లు తొలగించే ప్రక్రియను ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో వ్యాపించిన ఆ చెట్లు, పిచ్చిమొక్కలు తొలగించేందుకు రూ.36 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి? - అధ్యయనానికి సాంకేతిక కమిటీ నియామకం - Committee on capital region

Last Updated : Aug 2, 2024, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.