Harithaharam as Vana Mahotsavam : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'హరితహారం' కార్యక్రమాన్ని 'వన మహోత్సవం' పేరుతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు.
'హరితహారం' పేరు మార్చిన సర్కార్ - ఇకపై ఏమని పిలవాలంటే?
Vana Mahotsavam in Telangana (ETV Bharat)
Published : Jun 23, 2024, 8:59 AM IST
ఈ కార్యక్రమం 1950లో ప్రారంభమైంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. మొక్కలు నాటేందుకు, సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.