ETV Bharat / snippets

వామ్మో మొసళ్లు - ఈ పులి ఏంటి ఇలా తెల్లగా ఉంది? - నడిరోడ్డుపై వన్యప్రాణులు

CROCODILES ESCAPED
WILD ANIMALS IN NIRMAL DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 10:25 AM IST

Animals Vehicle Accident in Nirmal : వన్య ప్రాణులను తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటన నిర్మల్​ జిల్లాలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు అందులోని జీవాలన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. బిహార్‌ రాజధాని పట్నాలోని సంజయ్‌గాంధీ జాతీయ జూపార్కు నుంచి వివిధ రకాల వన్యప్రాణులను రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ జూపార్కుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీటిలో ప్రముఖ ఘరియాల్‌ జాతికి చెందిన మొసళ్లు, అరుదైన తెల్ల పులి ఉన్నాయి.

బుధవారం నిర్మల్‌ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి చేరుకున్నాక రెండు వాహనాల్లో ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. 8 మొసళ్లలో రెండు బయటపడగా, అవి తప్పించుకుపోకుండా స్థానిక అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. వెంటనే మరో వాహనాన్ని సిద్ధం చేసి, అన్నింటినీ అందులో తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.